City Life: పల్లె నుంచి వచ్చి పట్టణాల్లో ఎలా బతకాలి.. కాకుల నుంచి నేర్చుకోండి..అదెలా అంటే..!

City  Life:  పల్లె నుంచి వచ్చి పట్టణాల్లో ఎలా బతకాలి.. కాకుల నుంచి నేర్చుకోండి..అదెలా అంటే..!

అప్పుడెప్పుడో ఓ కాకి చెప్పింది..కుండలో నీళ్లు పైకి రావాలంటే గులక రాళ్లు వేయాలని.. అది పల్లెటూరి కాకి.. మరి జపాన్​ కు  చెందిన పట్నం కాకి సిటీలో బతుకుడెట్లనో నేర్పుతుంది. ఏమో ఏం చెప్పగలం? ఫ్యూచర్లో స్టూడెంట్స్​ కు  పాఠం అవుతుందేమో..

ఐక్యరాజ్యసమితి లెక్కల ప్రకారం ముందెన్నడూ లేనంత ఎక్కువగా ఇప్పుడు ప్రజలుపట్టణాల్లో నివసిస్తున్నారు. . 1960లో ప్రపంచ జనాభాలో 34 శాతం మంది పట్టణాల్లో నివసించగా, ఐక్యరాజ్యసమితి  2018 లెక్కల ప్రకారం 55 శాతం మంది పట్టణాల్లో ఉన్నారు.

పల్లెలు ఖాళీ అయిపోతున్నయ్. ఏ పని దొరికితే అది చేసుకుంటూ బతుకుదామనుకున్న చదువుకున్నోళ్లు . అంతా పట్నానికి వచ్చేస్తున్నారు. అయితే ఇలా వచ్చినవాళ్లలో సగం మంది మళ్లీ సొంత ఊరికే వెళ్లిపోతున్నారు. ఎందుకంటే పట్నంలో బతకడం  వాళ్లతో కావడంలేదు. కలోగంజో తాగి ఉన్న ఊళ్లోనే బతుకుదామనుకుంటున్నారు..

ఇగ మిగిలిన సగం మంది మాత్రం మళ్లీ ఊరికి ఏం మొఖం పెట్టుకొని పోతాం? ఎందుకు తిరిగొచ్చిందంటే ఏం చెప్తాం? కష్టమైనా, నష్టమైనా పట్నంలనే బతుకుదామని అనుకుంటున్నారు. కన్నవారికి... ఊరివారికి  దూరంగా బతుకు ఈడుస్తున్నారు. ఉపాసముంటున్నా.. బాగానే ఉన్నామని చెప్తున్నారు.

అయితే పట్నం వచ్చిన వాళ్లలో కొందరు మాత్రం సిటీలైఫ్ కు బాగానే అలవాటు పడుతున్నారు. పండుగలకు పబ్బాలకు ఊరికెళ్తే వాళ్లను గుర్తుపట్టడం కూడా కష్టమే. అంతగా మారిపోతున్నారు. వీళ్లను చూసి పట్నంకు పోవాలని ఊరిలోని వాళ్లు కూడా అనుకునేంత మార్పు కనిస్తోంది.

కొందరేమో బతకలేక తిరిగి వెళ్లిపోతున్నారు. మరికొందరేమో... కష్టపడుతూ సిటీలోనే బతుకుతున్నారు. ఇంకొందరేమో చాలా ఈజీగా అలవాటు పడిపోతున్నారు. ఎందుకిట్ల? ఇదే విషయమై జపాన్ సైంటిస్టులు రీసెర్చ్ చేశారు. ఈ రీసెర్చ్ లో ఏం తేలిందంటే... సిటీ లైఫ్ కు మనుషుల కంటే పక్షులు, జంతువులే తొందరగా అలవాటు పడుతున్నాయట. సెండాయ్ అనే నగరంలో కాకులపై రీసెర్చ్ చేస్తే ఈ విషయం తెలిసిందట. 

ఇంతకీ ఆ కాకులు ఏంచేస్తున్నాయంటే... సెండాయ్ నగరం వాల్​ నట్స్ కు ప్రసిద్ధి. అక్కడ ఎక్కువగా పండే పంట కూడా అదే. దీంతో మనదగ్గర మక్కలు, వడ్ల లెక్కసెండాయ్ సిటీలో వాల్​ నట్స్​ను ఎండబెడతారు. దీంతో వాల్​నట్స్ కు అక్కడి కాకులు బాగా అలవాటు పడ్డాయట అయితే ఈ అలవాటును కాకులు కొత్తగా ఏం నేర్చుకోలేదు. ఎన్నో ఏండ్లుగా అక్కడి కాకులు

►ALSO READ | Childrens care: పిల్లలను ఇలా పెంచండి..ఙ్ఞానం పెరుగుతుంది.. లైఫ్ లో నో బ్యాక్ స్టెప్

వాల్​నట్స్​ ను తిని బతుకుతున్నాయట. అయితే ఇవి వాల్​ నట్స్ తినే పద్ధతి చాలా డిఫరెంట్ గా ఉంటది. వాటిపై ఉండే షెల్​ ను  పగలగొట్టేందుకు అవి తమ తెలివిని ఉపయోగిస్తాయి. గింజను ముక్కులో పట్టుకొని వీలైనంత ఎత్తుకు ఎగురుతాయి. అక్కడి నుంచి దానిని కింద పడేస్తాయి. దీంతో వాల్నల్​ నట్ షెల్ పలిగి, అందులోని పలుకు బయటపడుతుంది. అప్పుడు వాటిని తింటాయి. ఈ పద్దతిని పెంచాయి కాకులు వందల ఏళ్లుగా ఫాలో అవుతున్నయ్. అయితే ఇటీవల అవి పద్ధతిని మార్చుకున్నయ్.

జపాన్​ లోని సెండాయ్ కూడా ఇటీవల కాలంలో జనాభా వేగంగా విస్తరించింది. అక్కడి వాహనాల సంఖ్య ఏకంగా 400 శాతం పెరిగింది. దీంతో గల్లీ రోడ్డు మీద కూడా వాహనాల రాకపోకలు పెరిగినయ్. వీటిని చూసి. కాకులు లైఫ్ స్టయిల్ ను మార్చుకున్నాయని సైంటిస్టులు చెబుతున్నారు. కాకులు కష్టపడి వాల్​ నట్స్​  గింజలను పైకి తీసుకెళ్లలేవట. అలా తీసుకొచ్చి, ఇలా రోడ్డుమీద పడేస్తున్నాయట. కార్లు, బస్సులు వాటి మీద నుంచి పోగానే షెల్స్​ పగిలి, అందులోని పలుకులు బయటకు వస్తున్నాయని, ఏమాత్రం కష్టపడకుండానే. కాకులు వాల్​ నట్స్​ తింటూ ఎంజాయ్ చేస్తున్నాయని చెబుతున్నారు.

ఫ్యూచర్ జనరేషన్ కు ప్రకృతి అంటే పార్కులే గుర్తుకు వస్తయని సైంటిస్టులు చెబుతున్నారు. ఎందుకంటే పట్టణాల్లో పెరిగేవారికి పల్లె అందాలు, పచ్చని పొలాలు, చెరువు గురించి తెలిసే అవకాశం లేదంటున్నారు. ఒకప్పుడు ఎన్నోరకాల కీటకాలు చెట్లకు గూళ్లు కట్టుకునేవని, ఇప్పుడు భవనాల సీలింగ్ లకు అనుకొని గూళ్లు కట్టుకుంటున్నాయని చెబుతున్నారు. పక్కనే చెట్లు ఉన్నా కూడా బిల్డింగుల కిందనే గూళ్లు కట్టుకుంటున్నాయట. ఫ్యూచర్ జనరేషన్ కూడా అంతే... సహజమైన ప్రకృతి అందాలు అందుబాటులో ఉన్నా.. పార్కులు, రిసార్టులకు వెళ్లేందుకే ఇష్టపడతరని చెబుతున్నారు.