హెచ్పీ తన పెవిలియన్ ఎక్స్360, పెవిలియన్ ప్లస్ సిరీస్ ల్యాప్‌టాప్‌లను మంగళవారం భారతదేశంలో లాంచ్ చేసింది. కంపెనీ ప్రకటించిన కొత్త ల్యాప్‌టాప్‌లలో హెచ్పీ 15 (2023), హెచ్పీ పెవిలియన్ ఎక్స్360 (2023), హెచ్పీ పెవిలియన్ ప్లస్ 14 (2023) ఉన్నాయి. ల్యాప్‌టాప్‌లు తేలికగా, నాజూగ్గా ఉంటాయి. హెచ్పీ పెవిలియన్ ఎక్స్360 మోడల్ 360-డిగ్రీల హింజ్‌తో వస్తుంది. ఈ ల్యాప్‌టాప్స్‌లో 12వ, 13వ జెన్ ఇంటెల్ కోర్ ప్రాసెసర్స్ ఉంటాయి. ఫింగర్‌ప్రింట్ రీడర్, మాన్యువల్ కెమెరా షట్టర్ వంటి సదుపాయాలూ ఉంటాయి. ధరలు రూ.58 వేల నుంచి మొదలవుతాయి.
