విశాఖలో హెచ్ పీ ఫెసిలిటీ ప్రారంభం

విశాఖలో హెచ్ పీ ఫెసిలిటీ ప్రారంభం

న్యూఢిల్లీ: హిందుస్థాన్ పెట్రోలియం (హెచ్​పీ) కార్పొరేషన్ లిమిటెడ్ విశాఖపట్నం రిఫైనరీలో రెసిడ్యూ అప్‌‌‌‌గ్రేడేషన్ ఫెసిలిటీని ప్రారంభించింది. దీనివల్ల ప్లాంట్ సామర్థ్యం పెరగడంతో పాటు లాభాలూ మెరుగుపడతాయని కంపెనీ తెలిపింది.  దేశంలోనే ఇది మొదటి రెసిడ్యూ హైడ్రోక్రాకింగ్ యూనిట్ కాగా, వార్షిక సామర్థ్యం 3.55 మిలియన్ టన్నులు. ప్రపంచంలోనే అతిపెద్ద ఎల్ సీ-మాక్స్ యూనిట్ ను ఇక్కడ ఏర్పాటు చేశారు. 

ఇది తక్కువ విలువ గల ముడి చమురు అవశేషాలను 93 శాతం వరకు అధిక విలువైన పెట్రోలియం ఉత్పత్తులుగా మారుస్తుంది. దిగుమతి చేసుకునే ఇంధనాలపై ఆధారపడటాన్ని తగ్గించేందుకు ఈ ప్రాజెక్ట్ తోడ్పడుతుంది.  డీజిల్ వంటి ఉత్పత్తుల తయారీ పెరగడం వల్ల మార్కెటింగ్ అవసరాల కోసం బయటి నుంచి కొనే అవసరం తగ్గుతుంది. ఆత్మనిర్భర్ భారత్ లో భాగంగా కీలక పరికరాలను దేశీయంగానే తయారు చేశారు. డిజిటల్ ఆప్టిమైజేషన్ ద్వారా దీని పనితీరును పర్యవేక్షిస్తారు.