
హైదరాబాద్: కష్టపడితే ప్రతిఒక్కరూ తమ లక్ష్యాలను సాధించవచ్చని అన్నారు రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి. శనివారం (జూలై 5) రామంతాపూర్‌లోని హైదరాబాద్ పబ్లిక్ స్కూళ్లో ఇనిస్టిట్యూర్ సెర్మనీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి మంత్రి వివేక్ చీఫ్ గెస్ట్‌గా హాజరయ్యారు. ఈ సంద్భంగా ఎన్సీసీ క్యాడెట్స్ నుంచి గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం విద్యార్థులను ఉద్దేశించి మంత్రి వివేక్ ప్రసంగించారు. విద్యార్థులకు హెచ్‌పీఎస్ (హైదరాబాద్ పబ్లిక్ స్కూల్) ఇన్నోవేటివ్ ఐడియాలను ఇస్తోందన్నారు. ఉన్నత స్థానాలకు వెళ్లినా.. చదువుకున్న పాఠశాలను మరువొద్దన్న వివేక్.. పూర్వ విద్యార్థులు హెచ్‌పీఎస్‌కు ఏదో ఒక విధంగా సహయపడాలని పిలుపునిచ్చారు.
ఈ స్కూల్‌కు వచ్చినందుకు బేగంపేటలో హెచ్‌పీఎస్‌లో నేను చదివిన రోజుల గుర్తుకొచ్చాయి. 17 ఏళ్ల తర్వాత ఈ స్కూల్‌కి వచ్చాను. చుట్టుపక్కల పరిస్థితులు మారిపోయాయి. ప్రిన్సిపాల్ లక్ష్మీ రెడ్డి, టీచర్ల టీం చాలా చక్కగా పని చేస్తున్నారని అన్నారు. తాను బేగంపేట్ హెచ్‌పీఎస్‌లో చదివానని, మా టైంలో బేగంపేట్, రామంతపూర్ రెండూ ఒకేలా ఉండేవని.. చదువు, క్రీడలు, కల్చర్ అన్నీ సమానంగా ఉండేవని గుర్తు చేశారు. హెచ్‌పీఎస్ బేగంపేట్‌లో నేర్చుకున్నదే నాకు జీవితంలో ఉపయోగపడిందన్నారు.
►ALSO READ | తెలంగాణలో కొత్తగా 157 సర్కారీ స్కూళ్లు .. వెంటనే ప్రారంభించాలని డీఈఓలకు ప్రభుత్వం ఆదేశం
మొదట డాక్టర్‌గా, తర్వాత ఇండస్ట్రీ, ఆ తర్వాత స్టార్టప్ పెట్టి చివరికి మీడియా, పాలిటిక్స్‌లోకి వచ్చానని తెలిపారు. ఇవన్ని ఒక్క స్కూల్లో నేర్చుకున్న విలువలతోనే సాధ్యమయ్యాయని చెప్పారు. హెచ్‌పీఎస్ లో చదివిన వాళ్లు ఏ రంగంలోనైనా రాణిస్తారు.. ప్లానింగ్ బాగా చేస్తారు. గోల్స్ పెట్టుకుని రీచ్ అవుతారన్నారు. బయట చాలా మంది ఒక ఉద్యోగంలో స్థిరపడితే HPS వాళ్లు మాత్రం రోల్స్ మార్చుకుంటూ అన్ని రంగాల్లో రాణిస్తారన్నారు. బయటవాళ్లకి HPS స్టూడెంట్స్ అంటే ఒక గౌరవం, కొంత అసూయ కూడా ఉంటుందని.. ఇది మన స్టాండర్డ్‌కి నిదర్శనమని అన్నారు.