సీఏఎస్‌‌‌‌లకు పోస్టింగులు ఇవ్వండి: హెచ్ఆర్డీఏ -

సీఏఎస్‌‌‌‌లకు పోస్టింగులు ఇవ్వండి: హెచ్ఆర్డీఏ -

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో సివిల్ అసిస్టెంట్ సర్జన్ (స్పెషలిస్ట్) పోస్టుల భర్తీ ప్రక్రియ నత్తనడకన సాగుతుండటంపై హెల్త్‌‌‌‌ కేర్ రిఫార్మ్స్ డాక్టర్స్ అసోసియేషన్(హెచ్ఆర్డీఏ) ఆందోళన వ్యక్తం చేసింది. గతేడాది ఆగస్టులో మొత్తం 1,623 పోస్టుల కోసం మెడికల్ రిక్రూట్‌‌‌‌మెంట్ బోర్డు నోటిఫికేషన్ విడుదల చేయగా.. ఈ ఏడాది ఏప్రిల్ 7న 692 మందికి మాత్రమే నియామక పత్రాలు అందజేసిందని, మిగిలిన 931 పోస్టుల భర్తీని మధ్యలోనే నిలిపివేసిందని అసోసియేషన్ ప్రతినిధులు మండిపడ్డారు.

నోటిఫికేషన్ ఇచ్చి దాదాపు ఏడాది గడుస్తున్నా, మిగిలిన పోస్టులకు సంబంధించి ఇప్పటి వరకు సర్టిఫికెట్ వెరిఫికేషన్ కూడా చేపట్టకపోవడంతో వేలాది మంది డాక్టర్లు ఆందోళనకు, ఆర్థిక ఇబ్బందులకు గురవుతున్నారని ప్రభుత్వానికి రాసిన లేఖలో వివరించారు. తక్షణమే ప్రభుత్వం స్పందించి పెండింగ్‌‌‌‌లో ఉన్న నియామక ప్రక్రియను వెంటనే పూర్తి చేయాలని హెచ్ఆర్డీఏ డిమాండ్ చేసింది.