
వీరేనట పదిహేను వందల కోట్ల భారీ బడ్జెట్ తో త్రీడీ రామాయణాన్ని రూపొందించడానికి ఏర్పాట్లు జరుగుతున్న సంగతి తెలిసిందే. మూడు భాగాలుగా హిందీ,తెలుగు, తమిళ భాషల్లో రూపొందే ఈ సినిమా సన్నాహాలు మొదలయ్యాయి.ఆల్రెడీ మొదటి పార్ట్ కి స్క్రిప్ట్ సిద్ధమయ్యిందట. నటీనటుల విషయంలో తర్జనభర్జనలు జరుగుతున్నాయంటున్నారు అన్ని భాషల వారికీ కనెక్ట్ అవ్వాలి. కనుక సీతారాముల పాత్రలకు పాపులర్ స్టార్స్ నే తీసుకునే ఆలోచనలో ఉన్నారట ముగ్గురు దర్శకులు, నిర్మాతలు. అందరి మనసుల్లోనూ కామన్ గా ఉన్న పేర్లు హృతిక్ రోషన్, దీపికా పదుకొనె అని తెలుస్తోంది. హృతిక్ ఫిజిక్‌ని బట్టి అతడు రాముడి పాత్రకి అచ్చంగా సరిపోతాడని అనుకుంటున్నారట.
ఆల్రెడీ పద్మావతి, బాజీరావ్ మస్తానీ వంటి చిత్రాల్లో ట్రెడిషనల్ లుక్‌లో అదరగొట్టింది కనుక సీతగాదీపిక అద్భుతంగా సూటవుతుందని భావిస్తున్నారట.ఈ విషయమై దర్శక నిర్మాతలు నిర్ణయం తీసేసుకున్నారని… హృతిక్, దీపికలు కూడా కన్విన్స్అయ్యారని తెలుస్తోంది. అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. ఈ షయమైతే బయట పెట్టలేదు కానీ,సిని మా విషయమై చాలా ఎక్సయిటింగ్ గా ఉన్నానని మాత్రం అన్నాడు దర్శకుడు నితేష్ తివారి. ‘ఈ సిని మాని ఎప్పుడెప్పుడు సెట్స్‌పైకి తీసుకొద్దా మా అని ఎదురుచూస్తున్నా. ప్రపంచచరిత్రలోనే ఎంతో గొప్పగా నిలిచిపోయేలా తీయాలనుకుంటున్నా. నేను డైరెక్ట్ చేస్తున్న ‘చిచోరే’ రిలీజ్కాగానే ఈ మూవీ పట్టాలెక్క నుంది’అంటూ ఉత్సాహంగా చెప్పాడు తివారీ.ఆల్రెడీ సెట్స్ కి వెళ్లడానికిరెడీ అవుతున్నారంటే సీతారాములు కూడా కన్ఫర్మ్అయిపోయి ఉంటారుగా!