ఎన్టీఆర్తో వార్ కన్ఫర్మ్ చేసిన హృతిక్.. పిచ్చెక్కించే అప్డేట్ ఇచ్చాడు

ఎన్టీఆర్తో వార్ కన్ఫర్మ్ చేసిన హృతిక్.. పిచ్చెక్కించే అప్డేట్ ఇచ్చాడు

యంగ్ టైగర్ ఎన్టీఆర్ పుట్టినరోజు సంధర్బంగా బాలీవుడ్ హ్యాండ్సమ్ హంక్ హృతిక్ రోషన్ విషెస్ తెలిపాడు. అంతేకాదు ఇందులో భాగంగా అదిరిపోయే అప్డేట్ ఇచ్చాడు హ్రితిక్.. నీకోసం యుద్ధభూమిలో వేచి చూస్తున్నానంటూ ఇండైరెక్ట్ గా ‘వార్ 2’ సినిమాపై అప్డేట్ ఇచ్చేశాడు. ఇక ఈ ట్వీట్ చివర్లో తెలుగులో ‘పుట్టినరోజు శుభాకాంక్షలు మిత్రమా’ అంటూ ఫైనల్ టచ్ ఇచ్చాడు.

 ‘హ్యాపీ బర్త్ డే తారక్. ఈ సంతోషకరమైన రోజుని నువ్వు ఎంజాయ్ చేయాలని కోరుకుంటున్నా. నీకోసం యుద్ధభూమిలో వేచి చూస్తున్నాను. మనం కలిసేంత వరకు నీ ప్రతిరోజూ శాంతియుతంగా, సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను. పుట్టినరోజు శుభాకాంక్షలు మిత్రమా’’ అంటూ ట్వీట్ చేశాడు. ఇక ఈ ఒక్క ట్వీట్ తో వీళ్లిద్దరు కలిసి ‘వార్ 2’లో నటిస్తున్నారని మరోసారి కన్ఫమ్ అయ్యింది. 

ఈ ట్వీట్ చూశాక ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీ గా ఫీల్ అవుతున్నారు. ఇది కదా అసలైన బర్త్ డే అప్డేట్ అంటే అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇక వార్2 సీక్వెల్‌ను ‘బ్రహ్మాస్త్ర మూవీ దర్శకుడు అయాన్ ముఖర్జీ రూపొందించనున్నాడు. ప్రస్తుతం ఈ హీరోలు చేస్తున్న ప్రాజెక్టులను ముగించుకున్న తర్వాత.. ‘వార్ 2’ సెట్స్‌లోకి తారక్, హృతిక్ అడుగుపెట్టనున్నారు. ఇందుకోసం చాలా సమయమే పట్టేలా ఉంది.