ప్రపంచంలోనే అందగాడు హృతిక్

ప్రపంచంలోనే అందగాడు హృతిక్

హృతిక్ రోషన్ స్టైల్, యాక్టింగ్, ఫిట్ నెస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బాలీవుడ్ లో స్టైలీష్ హీరోగా, అతని వేసే స్టెప్పులకు చాలా మంది ఫిదా అవుతారు. ఫిట్ నెస్ లోనూ హృతిక్ సపరేట్ స్టైల్ ,కండలకు తగిన బాడీ హృతిక్ సొంతం. అలాంటి హృతిక్ వరల్డ్ లోనే అందగాడుగా రికార్డ్ సృష్టించాడు. అమెరికాకు చెందిన ఓ ఏజెన్సీ లేటెస్ట్ గా రిలీజ్ చేసిన టాప్ 5 మోస్ట్ హ్యాండ్సమ్ మెన్ జాబితాలో హృతిక్‌ టాప్ ప్లేస్ లో నిలిచాడు. క్రిస్ ఎవాన్స్, డేవిడ్ బెక్హాం, రాబర్ట్ ప్యాటిన్సన్ వంటి వారిని వెనక్కి నెట్టి ఫస్ట్ ప్లేసులో నిలిచాడు హృతిక్.