Fighter Movie OTT: ఓటీటీలోకి వచ్చేస్తున్న ఫైటర్..స్ట్రీమింగ్ ఎప్పుడు..ఎక్కడంటే..?

Fighter Movie OTT: ఓటీటీలోకి వచ్చేస్తున్న ఫైటర్..స్ట్రీమింగ్ ఎప్పుడు..ఎక్కడంటే..?

బాలీవుడ్ స్టార్‌ హీరో హృతిక్ రోషన్ (Hritik Roshan), గ్లామర్ డాల్ దీపికా పదుకోనే (Deepika Padukone) కాంబోలో వస్తున్న లేటెస్ట్ మూవీ ఫైటర్‌(Fighter). వార్‌, పఠాన్ వంటి యాక్షన్ మూవీస్ తెరకెక్కించిన టాలెంటెడ్ డైరెక్టర్ సిద్ధార్థ్‌ ఆనంద్‌(Siddharth Anand) ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు.

ఇండియన్‌ ఎయిర్‌ఫోర్స్‌ బ్యాక్డ్రాప్ లో.. అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ఎంటర్టైనర్గా వచ్చిన ఈ సినిమా జనవరి 25న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. దేశభక్తి ప్రధానంగా తెరకెక్కిన ఈ యాక్షన్ మూవీ రిలీజైన ఆరు రోజుల్లోనే రూ.215 కోట్లకు పైగా రికార్డ్ కలెక్షన్స్ రాబట్టింది.   

లేటెస్ట్గా ఫైటర్‌ మూవీ ఓటీటీలోకి రాబోతున్నట్లు సమాచారం.ఈ మూవీ ఓటీటీ హక్కులను ప్రముఖ సంస్థ నెట్‌ఫ్లిక్స్(Netflix) రికార్డ్ ధరకు స్ట్రీమింగ్ హక్కులను దక్కించుకున్నది. దాదాపు రూ.75 కోట్ల మేరకు నెట్‌ఫ్లిక్స్ ఫైటర్ డిజిటల్ హక్కులను సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా థియేటర్లో రిలీజైన 56 రోజుల తరువాత స్ట్రీమింగ్ చేయబోనున్నట్లు ఫైటర్ మేకర్స్తో..నెట్‌ఫ్లిక్స్ ఒప్పందం కుదుర్చుకుంది. అయితే ఫైటర్ మూవీ మార్చి 25 న లేదా 29న స్ట్రీమింగ్ అయ్యే అవకాశం కనిపిస్తోంది. 

ఫైటర్ మూవీ జనవారి 25న రీలిజ్ కాగా..కేవలం హిందీ వెర్షన్ లోనే రావడం వల్ల రూ. 225కోట్లు మాత్రమే కలెక్ట్ చేసింది. ఇక ఓటీటీలో మాత్రం హిందీతో పాటుగా తెలుగు, తమిళ,కన్నడ, మలయాళ భాషల్లోను ఫైటర్ మూవీని స్ట్రీమింగ్ చేయబోతున్నట్లు సమాచారం.

హృతిక్ రోషన్‌, దీపికా పదుకోనే తొలిసారిగా కలిసి నటించిన ఈ మూవీలో ఘాటైన రొమాంటిక్ సీన్స్ ఉండటం వల్ల ఫ్యాన్స్ థియేటర్లో ఊగిపోయారు. మరి త్వరలో ఓటీటీలోకి వచ్చాక ఫ్యాన్స్ పరిస్థితి ఏంటో!