ప్రణయ్‌‌‌‌‌‌‌‌‌‌ మరో ఓటమి

ప్రణయ్‌‌‌‌‌‌‌‌‌‌ మరో ఓటమి

బ్యాంకాక్‌‌‌‌: బీడబ్ల్యూఎఫ్‌‌‌‌ వరల్డ్‌‌‌‌ టూర్‌‌‌‌ ఫైనల్స్‌‌‌‌లో తొలిసారి బరిలో నిలిచిన ఇండియా స్టార్‌‌‌‌ షట్లర్‌‌‌‌ హెచ్‌‌‌‌ఎస్‌‌‌‌ ప్రణయ్‌‌‌‌ గ్రూప్‌‌‌‌ దశలోనే వైదొలిగాడు. ఈ టోర్నీలో వరుసగా రెండో మ్యాచ్‌‌‌‌లోనూ ప్రణయ్‌‌‌‌కు చుక్కెదురైంది.

గురువారం జరిగిన గ్రూప్‌‌‌‌–ఎ పోరులో ప్రణయ్‌‌‌‌ 21–23, 21–17, 19–21తో చైనా షట్లర్‌‌‌‌ లు గ్వాంగ్‌‌‌‌ జు చేతిలో పోరాడి ఓడిపోయాడు. దాంతో, సెమీస్‌‌‌‌ రేసు నుంచి  వైదొలిగాడు. శుక్రవారం జరిగే గ్రూప్‌‌‌‌ మూడో మ్యాచ్‌‌‌‌లో తను వరల్డ్‌‌‌‌ నంబర్‌‌‌‌ వన్‌‌‌‌ విక్టర్‌‌‌‌ అక్సెల్సెన్‌‌‌‌ తో పోటీ పడతాడు.