
విశాఖపట్టణంలోని హిందుస్థాన్ షిప్‌యార్డ్ లిమిటెడ్(హెచ్ఎస్ఎల్) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా అప్లై చేయవచ్చు. అప్లికేషన్ల సమర్పణకు చివరి తేదీ ఆగస్టు 09.
పోస్టుల సంఖ్య: 47.
పోస్టులు: మేనేజర్(టెక్నికల్) 03, ప్రాజెక్ట్ సూపరింటెండెంట్(టెక్నికల్) 02, డిప్యూటీ ప్రాజెక్ట్ ఆఫీసర్(టెక్నికల్) 14, డిప్యూటీ ప్రాజెక్ట్ ఆఫీసర్(సబ్ మెరైన్) 09, డిప్యూటీ ప్రాజెక్ట్ ఆఫీసర్(సివిల్) 03, డిప్యూటీ ప్రాజెక్ట్ ఆఫీసర్(హెచ్ఆర్) 06, డిప్యూటీ ప్రాజెక్ట్ ఆఫీసర్(సెక్యూరిటీ) 01, డిప్యూటీ ప్రాజెక్ట్ ఆఫీసర్(కార్పొరేట్ కమ్యూనికేషన్) 01, డిప్యూటీ ప్రాజెక్ట్ ఆఫీసర్(డిజైన్) 02, సీనియర్ కన్సల్టెంట్(డిజైన్)01, సీనియర్ కన్సల్టెంట్(లీగల్)01, సీనియర్ కన్సల్టెంట్(బిజినెస్ అండ్ డెవలప్మెంట్) 01, కన్సల్టెంట్(సబ్ మెరైన్) 02, కన్సల్టెంట్(ఢిల్లీ ఆఫీస్) 01.
ఎలిజిబిలిటీ: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో డిప్లొమా, డిగ్రీ, బీటెక్ లేదా బీఈ, ఎల్ఎల్బీ, పీజీలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. పని అనుభవం తప్పనిసరి.
అప్లికేషన్: ఆన్లైన్ ద్వారా.
అప్లికేషన్లు ప్రారంభం: జులై 09.
లాస్ట్ డేట్: ఆగస్టు 09.
అప్లికేషన్ ఫీజు: జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు రూ.300. ఎస్సీ, ఎస్టీ, పీహెచ్ అభ్యర్థులకు ఫీజు నుంచి మినహాయింపు ఉంటుంది.
సెలెక్షన్ ప్రాసెస్: ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.