
అనంతపురం జిల్లా గుంతకల్లు మస్తానయ్య దర్గా దగ్గర చినపోయిన ఓ యాచకుని దగ్గర భారీ మొత్తంలో నగదు గుర్తించారు పోలీసులు. చిత్తూరు జిల్లా మదనపల్లెకి చెందిన బషీర్ షాబ్ … 15 ఏళ్లుగా గుంతకల్లులోని మస్తానయ్య దర్గా దగ్గర బిక్షాటన చేస్తూ జీవిస్తున్నాడు. అనారోగ్యం కారణంగా బషీర్ షాబ్ ఇవాళ బుధవారం మరణించాడు. మృతదేహన్ని తరలించే క్రమంలో బషీర్ షాబ్ పరుచుకున్న దుప్పట్లు, బస్తాలు తొలగించగా నోట్లు బయటపడ్డాయి. నోట్లన్నింటినీ లెక్కించిన అధికారులు.. మొత్తం రూ.32 లక్షల 20 వేలు ఉన్నట్లు గుర్తించారు. ఇంత డబ్బు బయటపడటంతో అధికారులు ఆశ్చర్యపోయారు.