గ్రేట్​ ఇండియన్​ ఫెస్టివల్​ సేల్‌‌కు పెరిగిన డిమాండ్

గ్రేట్​ ఇండియన్​ ఫెస్టివల్​ సేల్‌‌కు పెరిగిన డిమాండ్

న్యూఢిల్లీ: ప్రస్తుతం జరుగుతున్న గ్రేట్​ ఇండియన్​ ఫెస్టివల్​ సేల్‌‌కు  మొదలైన 36 గంటల్లోనే టైర్​2,3 పట్టణాల నుంచి డిమాండ్​ విపరీతంగా పెరిగిందని ఆన్​లైన్​ షాపింగ్​ ప్లాట్​ఫారమ్​ అమెజాన్​ ప్రకటించింది.  మొత్తం కస్టమర్లలో వీరి సంఖ్యే 75 శాతం వరకు ఉంది.  అమెజాన్​ ఫెస్టివల్​సేల్​ను ఈ నెల 23న మొదలుపెట్టింది.  అమెజాన్ అందజేసిన డేటా ప్రకారం.. పండుగ సీజన్ సేల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో మొదటి 36 గంటల్లోనే ఎంఎస్​ఎంఈలు, స్టార్టప్‌‌‌‌‌‌‌‌లు 10 లక్షల ఉత్పత్తులను అమ్మాయి.  ప్రైమ్ మెంబర్షిప్​లు పోయిన ఏడాది కంటే 1.9 రెట్లు పెరిగాయి. ఎంఎస్​ఎంఈలు, స్టార్టప్‌‌‌‌‌‌‌‌లు, కళాకారులు, మహిళా పారిశ్రామికవేత్తలు తమ కస్టమర్లకు అనేక రకాల ప్రొడక్టులను అందిస్తున్నారని అమెజాన్‌‌‌‌‌‌‌‌ సీనియర్ ఎగ్జిక్యూటివ్​ ఒకరు అన్నారు. కస్టమర్లు ఎక్కువగా శామ్​సంగ్​, వన్​ప్లస్​, ఎంఐ, ఎల్​జీ, సోనీ బ్రాండ్లను ఇష్టపడుతున్నారని అన్నారు. సేల్​ సందర్భంగా అమెజాన్​ బిజినెస్​ సెగ్మెంట్​ సేల్​50 శాతం గ్రోత్​ సాధించిందని ఆయన అన్నారు. అమెజాన్ ఇండియా ప్రైమ్ మెంబర్లకు భారతదేశంలోని 50 కిపైగాప్రధాన నగరాలకు,  పట్టణాలకు సేమ్​డే డెలివరీలను అందిస్తోంది.  ఈ సంవత్సరం సూరత్, మైసూరు, మంగళూరు, భోపాల్, నాసిక్, నెల్లూరు, అనంతపురం, వరంగల్ వంటి 50 నగరాలు,  పట్టణాల్లో అందుబాటులో వచ్చాయి.

26 నుంచి యాపిల్​ సేల్​ 

యాపిల్​ 'లిమిటెడ్​ పీరియడ్​ ఆఫర్' సెప్టెంబర్ 26 నుండి ప్రారంభమవుతుంది. ఈ సందర్భంగా  అందుబాటులో ఉండే  డీల్స్ ​గురించి మాత్రం వెల్లడించలేదు.  ఐఫోన్​ 12, 12 మినీ ఫోన్లు కొన్నవారికి పోయిన ఏడాది ఎయిర్​పాడ్స్​ను బహుమతులుగా అందించింది. ఈసారి ఐఫోన్​ 13 బయర్లకు ఇదే ఆఫర్​ను అందించే అవకాశం ఉంది. 2021 సెప్టెంబరులో 13 సిరీస్​  ఫోన్లను లాంచ్​ చేసింది. దీని స్టార్టింగ్​ ప్రైస్​ రూ.80 వేలు కాగా, ఐఫోన్​ 14 అందుబాటులోకి రావడంతో ధరను రూ.70 వేలకు తగ్గించింది. ఫ్లిప్​కార్ట్​ ఐఫోన్​13ని రూ.57,900 లకు అమ్ముతోంది. పాత ఫోన్లను ఎక్స్చేంజి​ చేసుకుంటే రూ.16,900 వరకు ఇస్తున్నారు.