
జూబ్లీహిల్స్ వెంకటేశ్వర స్వామి దేవాలయానికి భక్తులు పోటెత్తారు. 2024, జనవరి 1వ తేదీ కొత్త సంవత్సరం పురస్కరించుకుని తొలి రోజు ఇష్టదైవాన్ని దర్శించుకునేందుకు తెలంగాణలోని ప్రధాన ఆలయాలకు భక్తులు తరలివస్తున్నారు. దీంతో ఆలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి.
హైదరాబాద్ లోని ప్రముఖ దేవాలయాలు భక్తులతో రద్దీ నెలకొంది. జూబ్లీహిల్స్ లోని వెంకటేశ్వర స్వామిని దర్శించుకునేందుకు పెద్ద ఎత్తున భక్తులు ఆలయానికి చేరుకుంటున్నారు. కుటుంబ సభ్యులు, బంధుమిత్రులతో కలిసి స్వామివారిని దర్శించుకుంటున్నారు. ఆలయంలో భక్తుల రద్దీ దృష్ట్యా అధికారులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు.