హైదరాబాద్లో భారీగా డ్రగ్స్ పట్టివేత.. 8మంది అరెస్ట్

హైదరాబాద్లో భారీగా డ్రగ్స్ పట్టివేత.. 8మంది అరెస్ట్

హైదరాబాద్ సిటీలో పెద్ద మొత్తంలో డ్రగ్స్ పోలీసులు పట్టుకున్నారు. పక్కా సమాచారంతో శుక్రవారం ఆగస్టు 16, 2024న సిటీలోని రాయదుర్గం పీఎస్ పరిధిలో మాదాపూర్ జోన్ ఎస్ వోటీ  పోలీసులు, రాయదుర్గం పోలీసులు సంయుక్తంగా ఆపరేషన్ నిర్వహించి డ్రగ్స్ పట్టుకున్నారు. డ్రగ్స్ సప్లయ్ చేస్తున్న ముఠాను అరెస్ట్ చేశారు. రాజస్థాన్ నుంచి హైదరాబాద్ కు అక్రమంగా డ్రగ్స్ తరలిస్తున్న 8మందిని అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి రూ. 4.34 కోట్ల విలువైన 620 గ్రాముల హెరాయిన్ ను స్వాధీనం చేసుకున్నారు.