
జపాన్‌లో భారీ భూకంపం సంభవించింది. ఏప్రిల్ 05వ తేదీ శుక్రవారం భూ ప్రకంపనలు ఏర్పడ్డాయి. దీంతో స్థానిక ప్రజలు తీవ్ర భయాందోళనకు గురై ఇండ్లలో నుంచి బయటకు పరుగులు తీశారు. భూకంపం తీవ్రత రిక్టరు స్కేలుపై 6.3గా నమోదైంది. సెంట్రల్ జపాన్ లోని ఇషికావా ప్రిఫెక్చర్ లో భూమికి 10 కి. మీ లోతులో భూకంప కేంద్రం ఉన్నట్లు జపాన్ మెటరాలజికల్ ఏజెన్సీ పేర్కొంది.
భూకంపం నేపథ్యంలో జపాన్ కు సునామీ ముప్పు లేదని జపాన్ మెటరాలజికల్ ఏజెన్సీ అధికారులు తెలిపారు. అయితే సముద్ర మట్టానికి 20 సెం.మీ కంటే తక్కువలో స్వల్ప మార్పులు వచ్చే అవకాశం ఉందని వాతావరణ సంస్థ తెలిపింది.
జపాన్ లో నెలరోజు వ్యవధిలోనే భూకంపం సంభవించడం ఇది రెండోసారి. జపాన్‌లో మే 1వ తేదీన స్వల్ప భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 5.9గా నమోదైంది. జపాన్‌లోని కట్సురెన్ -హెబారుకు తూర్పు ఆగ్నేయంగా 79 కి.మీ దూరంలో భాకంపం సంభవించింది. 10.8 కి.మీ లోతులో భూకంప తీవ్రత ఉందని పేర్కొంది. ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదు.