కూకట్‌పల్లిలో భారీ అగ్ని ప్రమాదం

V6 Velugu Posted on Jul 10, 2021

హైదరాబాద్ కూకట్‌పల్లిలోని ప్రశాంత్‌నగర్‌ పారిశ్రామికవాడలో  ఇవాళ(శనివారం) మధ్యాహ్నం భారీ అగ్ని ప్రమాదం జరిగింది. GSM లైఫ్‌సైన్స్‌ ఫార్మా పరిశ్రమలో.. మెడిసిన్ టెస్టింగ్‌లు నిర్వ‌హిస్తుండ‌గా ప్ర‌మాదం సంభ‌వించి కెమికల్ డ్ర‌మ్మ‌ల‌కు మంటలు అంటుకున్నాయి ఒక్కసారిగా మంటలు ఎగసిపడటంతో కార్మికులు బయటకు పరుగులు తీశారు. అగ్నిప్రమాదం జరిగిన స‌మ‌యంలో కంపెనీ య‌జ‌మాని సూర్య‌నారాయ‌ణ‌తో పాటు మ‌రో 10 మంది కార్మికులు పనిచేస్తున్నారు. పక్కనే ఉన్న ఇంటీరియర్‌ వస్తువుల షాపు కూడా మంటలు వ్యాపించాయి. స్థానికుల ద్వారా సమాచారం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలికి చేరుకుని మూడు అగ్నిమాపక వాహనాలతో మంటలు అదుపు చేశారు. ఈఘటనలో అదృష్ట‌వ‌శాత్తు ప్రాణ‌న‌ష్టం జ‌ర‌గ‌లేదు..కానీ..రూ. 6 కోట్ల దాకా ఆస్తినష్టం జరిగినట్లు సమాచారం. 

Tagged Kukatpally, Huge fire, broke out, Prashanth Nagar

Latest Videos

Subscribe Now

More News