నాగార్జునసాగర్ కు పోటెత్తిన వరద.. 18 గేట్లు ఎత్తివేత

నాగార్జునసాగర్ కు పోటెత్తిన వరద.. 18 గేట్లు ఎత్తివేత

నల్గొండ: ఎగువ నుండి వస్తున్న వరదకు తోడు.. మూడ్రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో.. నాగార్జునసాగర్ కు వరద పోటెత్తుతోంది. నిన్నటి నుండి 3 లక్షల క్యూసెక్కులకు పైగా వరద వస్తుండగా.. ఇవాళ ఉదయం 6 గంటల సమయానికి ఇన్ ఫ్లో 3.45 లక్షల క్యూసెక్కులు దాటింది. ఇది ఇంకా పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. డ్యాం ఇప్పటికే పూర్తి స్థాయిలో నిండిపోయి ఉంది. గరిష్ట స్థాయిలో నీటిని నిల్వ ఉంచుతూ..  వస్తున్న వరదను వస్తున్నట్లే దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం 3 లక్షల 45వేల  111 క్యూసెక్కులు వస్తుండగా.. సాగర్ 18 గేట్లను ఎత్తివేశారు. పూర్తి స్థాయి నీటిమట్టం 312.0450 టీఎంసీలు కాగా… 309.0570 టీఎంసీల నీటిని నిల్వ ఉంచుతూ.. వరదను కంట్రోల్ చేస్తున్నారు. అడుగుల్లో చూస్తే.. పూర్తి స్థాయి నీటిమట్టం 590 అడుగులు కాగా 589 అడుగుల నీటిమట్టం ఉంది.