మంత్రి సీతక్క జనగామ పర్యటనలో తీవ్ర ఉద్రిక్తత.. కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతల తోపులాట..

మంత్రి సీతక్క జనగామ పర్యటనలో తీవ్ర ఉద్రిక్తత.. కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతల తోపులాట..

మంత్రి సీతక్క జనగామ పర్యటనలో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది.. శుక్రవారం ( జనవరి 23 ) జనగామలోని పెంబర్తి క్రాస్ దగ్గర చాకలి ఐలమ్మ, దొడ్డి కొమరయ్య, సర్వాయి పాపన్నల విగ్రహావిష్కరణ కార్యక్రమానికి హాజరయ్యారు సీతక్క. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ కౌన్సిలర్ ను కొబ్బరికాయ కొట్టేందుకు ఆహ్వానించారు ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి. 

ఈ క్రమంలో బీఆర్ఎస్ పార్టీ కార్యక్రమం కాదంటూ అభ్యంతరం వ్యక్తం చేశారు కాంగ్రెస్ నేతలు. దీంతో ఇరువర్గాల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది.

ఇరువర్గాల మధ్య వాగ్వాదం తీవ్ర స్థాయికి చేరడంతో కాంగ్రెస్, బిఆర్ఎస్ నేతల మధ్య తీవ్ర తోపులాట చేసుకుంది. ఎమ్మెల్యే పల్లా గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు కాంగ్రెస్ నేతలు. అక్కడే ఉన్న పోలీసులు అడ్డుకొని ఇరువర్గాలను చెదరగొట్టారు.