గేటెడ్ కమ్యూనిటీ అపార్ట్‎మెంట్స్‎లో ఘోరం: ఆడుకుంటున్న బాలుడి పైనుంచి వెళ్లిన కారు

గేటెడ్ కమ్యూనిటీ అపార్ట్‎మెంట్స్‎లో ఘోరం: ఆడుకుంటున్న బాలుడి పైనుంచి వెళ్లిన కారు

అదో గేటెడ్ కమ్యూనిటీ అపార్ట్ మెంట్స్.. పార్కింగ్ ఏరియా.. ఓ పిల్లోడు త్రో సైకిల్‎పై ఆడుకుంటూ ఉన్నాడు. అదే సమయంలో అపార్ట్ మెంట్స్‎లోకి వచ్చిన ఓ ఖరీదైన కారు.. ఆ పిల్లోడిని ఢీకొట్టి.. ఆ పిల్లోడి మీదుగా వెళ్లింది. పిల్లోడి పొట్ట మీదుగా కారు టైర్లు వెళ్లటం సీసీ కెమెరాల్లో రికార్డ్ అయ్యింది. పూణె సిటీలోని ఓ హై ఎండ్ గేటెడ్ కమ్యూనిటీ పార్ట్ మెంట్స్‎లో జరిగిన ఈ ఘోరమైన ఘటన సీసీ కెమెరా విజువల్స్.. ఇప్పుడు ఇంటర్నెట్‎లో వైరల్ అవుతుంది. ఈ ఇన్సిడెంట్ పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

పూణే కల్భోర్‌ ప్రాంతంలోని జాయ్ నెస్ట్ గేటేడ్ కమ్యూనిటీలో దారుణం జరిగింది. గురువారం (జనవరి 22) సాయంత్రం కమ్యూనిటీలోని పార్కింగ్ ప్రాంగణంలో త్రో సైకిల్‎తో ఆడుకుంటున్న ఐదేళ్ల బాలుడుని కారు వేగంగా వచ్చి ఢీకొట్టి మీద నుంచి దూసుకెళ్లింది. వెంటనే బాలున్ని సమీపంలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. తీవ్రంగా గాయపడటంతో మార్గమధ్యలోని బాలుడు మరణించాడని వైద్యులు ప్రకటించారు. బాలుడి తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కారు డ్రైవర్‎పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. 

Also Raed : పిల్లలు పుట్టడం లేదని భార్యను చంపిన భర్త

ముంధ్వా రోడ్ ప్రాంతానికి చెందిన కారు డ్రైవర్ తన స్నేహితుడిని డ్రాప్ చేసేందుకు గేటేడ్ కమ్యూనిటీలోకి వచ్చినట్లు పోలీసులు గుర్తించారు. ఫ్రెండ్‎ను దింపి తిరిగి వేగంగా వెళ్తూ బాలుడిని ఢీకొట్టాడని పోలీసులు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించిన సీసీ ఫుటేజ్ ఇంటర్నెట్‎లో వైరల్‎గా మారింది. 

ఈ వీడియో ప్రకారం.. పార్కింగ్ ప్రదేశంలో ఐదేళ్ల బాలుడు త్రో సైకిల్‎పై ఆడుకుంటుండగా వేగంగా వచ్చిన కారు బాలున్ని ఢీకొట్టి మీదినుంచి దూసుకెళ్లింది. ఈ ఘటనలో బాలుడి తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే కారు దిగొచ్చిన డ్రైవర్ బాలున్ని ఆసుపత్రికి తరలించారు. పార్కింగ్ ప్రదేశంలో అంత వేగంగా వెళ్లడం ఏంటని కారు డ్రైవర్‎పై కమ్యూనిటీవాసులు మండిపడుతున్నారు.  నివాస ప్రాంగణంలో హైస్పీడ్ డ్రైవింగ్‌కు ఎలా అనుమతి ఇచ్చారని, డ్రైవర్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.