ద‌ళిత బంధు ప‌థ‌కానికి భారీగా నిధులు

ద‌ళిత బంధు ప‌థ‌కానికి భారీగా నిధులు

హైదరాబాద్: ద‌ళిత బంధు ప‌థ‌కానికి ఈ ఏడాది ముఖ్య‌మంత్రి కేసీఆర్ గ‌తంలో ఇచ్చిన హామీ మేర‌కు నిధుల‌ను భారీగా పెంచారు. దళిత బంధు కోసం గ‌త వార్షిక బ‌డ్జెట్‌లో వెయ్యి కోట్ల‌ను కేటాయించిన ప్రభుత్వం.. ఈసారి ఏకంగా రూ. 17,700 కోట్లు కేటాయించింది. దళిత బంధు పథకాన్ని హుజురాబాద్‌  నియోజకవర్గంతో పాటు చింతకాని, తిరుమలగిరి, నిజాంసాగర్‌, చారగొండ మండలాల్లో ప్రభుత్వం  ఇప్పటికే అమలు చేస్తోంది. దీంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నియోజకవర్గానికి వందమంది చొప్పున మొత్తం 119 నియోజకవర్గాల్లో 11వేల 800 కుటుంబాలకు దళితబంధు పథకం కింద ఆర్ధిక సాయం అందిస్తోంది. కాగా.. ఈ ఆర్థిక సంవత్సరం పూర్తయ్యేలోగా  రెండు లక్షల మందికి దళిత బంధు అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.

మరిన్ని వార్తల కోసం...

ఈ సారి బడ్జెట్ లో ఏముందంటే.?