బ్రెజిల్ నుంచి భారీగా ఆయిల్ కొనుగోలు.. ఐఈడబ్ల్యూలో ఒప్పందం

బ్రెజిల్ నుంచి భారీగా ఆయిల్ కొనుగోలు.. ఐఈడబ్ల్యూలో ఒప్పందం

న్యూఢిల్లీ:  బ్రెజిల్ నుంచి భారీగా ఆయిల్ కొనేందుకు ఇండియా రెడీ అవుతోంది. సుమారు 780 మిలియన్  డాలర్ల (సుమారు రూ.7,144 కోట్ల) విలువైన క్రూడ్ ఆయిల్‌‌‌‌ను దిగుమతి చేసుకునే ఒప్పందాన్ని ఈ నెల 27 ప్రారంభమయ్యే ఇండియా ఎనర్జీ వీక్ (ఐఈడబ్ల్యూ) లో కుదుర్చుకోనుంది.  దీంతో పాటు ఇతర కంపెనీలతో  ఇథేన్ రవాణా కోసం పెద్ద నౌకల నిర్మాణ ఒప్పందాలు జరుపుకోనుంది.   

 బీపీసీఎల్‌‌‌‌ 2026–-27 ఆర్థిక సంవత్సరంలో బ్రెజిల్‌‌‌‌ పెట్రోబ్రాస్‌‌‌‌ నుంచి 12 మిలియన్ బ్యారెల్స్‌‌‌‌ ఆయిల్ కొనుగోలు చేస్తుంది.  ఇది గత ఒప్పందం కంటే రెట్టింపు.  రెండు వెరీ లార్జ్ ఇథేన్ క్యారియర్స్‌‌‌‌ (వీఎల్‌‌‌‌ఈసీల)ను నిర్మించేందుకు ఓఎన్‌‌‌‌జీసీ, జపాన్‌‌‌‌ మిత్సుయి ఓఎస్‌‌‌‌కే లైన్స్‌‌‌‌‌‌‌‌ కలిసి దక్షిణ కొరియా శామ్‌‌‌‌సంగ్ హెవీ ఇండస్ట్రీస్‌‌‌‌తో ఒప్పందం చేసుకోనున్నాయి. 

అదనంగా, నూమాలిగడ్‌‌‌‌ రిఫైనరీ లిమిటెడ్‌‌‌‌ (ఎన్‌‌‌‌ఆర్‌‌‌‌‌‌‌‌ఎల్‌‌‌‌) – టోటల్  ఎనర్జీస్  మధ్య ఒడిశాలో రెండు లక్షల టన్నుల సస్టయినబుల్ ఏవియేషన్  ప్రాజెక్ట్‌‌‌‌ కోసం ఎంఓయూ,  ఎల్‌‌‌‌ఎన్‌‌‌‌జీ మార్కెట్‌‌‌‌ అవకాశాలపై ఎన్‌‌‌‌ఆర్‌‌‌‌‌‌‌‌ఎల్‌‌‌‌– ఆయిల్ ఇండియా– టోటల్ ఎనర్జీస్  మధ్య ప్రాథమిక ఒప్పందం కుదరనున్నాయి. భారత్‌‌‌‌పెట్రో రిసోర్సెస్, షెల్‌‌‌‌‌‌‌‌తో కలిసి గ్లోబల్‌‌‌‌ ఆయిల్‌‌‌‌ కంపెనీలలో వాటాలు కొనే అవకాశాలపై ఒప్పందం కుదుర్చుకోనుంది.