న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ సంస్థ భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ (బీహెచ్ఈఎల్)కు నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్(ఎన్టీపీసీ) నుంచి రూ.13,500 కోట్ల విలువైన భారీ ఆర్డర్ దక్కింది. తెలంగాణ స్టేజ్-2 థర్మల్ పవర్ ప్రాజెక్టు మెయిన్ ప్లాంట్ ప్యాకేజీ కోసం ఈ ఒప్పందం కుదిరింది.
2,400 మెగావాట్ల సామర్థ్యం గల ఈ ప్రాజెక్టుకు భెల్ బిడ్డర్‌గా నిలిచింది. ఎన్టీపీసీ నుంచి ఆదివారం నోటిఫికేషన్ ఆఫ్ అవార్డు అందుకుంది. ఇందులో మూడు 800 మెగావాట్ల యూనిట్ల డిజైన్, ఇంజనీరింగ్, తయారీ, సరఫరా, టెస్టింగ్ పనులు ఉంటాయి.
