
హైదరాబాద్: ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా పాతబస్తీలోని ఫలక్ నుమా వద్ద రైల్వే ట్రాక్ క్రింద 8 మీటర్ల వెడల్పుతో భూమి కుంగిపోయింది. కరోనా నేపథ్యంలో ప్రయాణికుల రైళ్ల రాకపోకలు లేకపోవడంతో పెద్ద ప్రమాదమే తప్పింది. బుధవారం మధ్యాహ్న సమయంలో గస్తీ నిర్వహిస్తున్న రైల్వే హోమ్ గార్డ్ ఈ గొయ్యిని గమనించడంతో.. వెంటనే రైల్వే అధికారులకు సమాచారం అందించాడు. అదే ట్రాక్ పై మరో 5 నిమిషాలలో గూడ్స్ రైల్ వెళ్లేందుకు అంతకుముందు రైల్వే అధికారులు గ్రీన్ సిగ్నల్ ఇవ్వగా.. హోమ్ గార్డ్ ఇచ్చిన సమాచారంతో అధికారులు ఆ గూడ్స్ రైలు ను కాసేపు సమీప రైల్వే స్టేషన్ లో ఆపారు. ప్రయాణికుల రైళ్లు నడవకపోవడం తో పెద్ద ప్రమాదమే తప్పిందని అక్కడి స్థానికులు అంటున్నారు.