దేశ వ్యాప్తంగా గణతంత్ర్య వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. హైదరాబాద్ లోని కొండాపూర్‌లో రిపబ్లిక్ డే వేడుకల్లో 1000 మీటర్ల జాతీయ జెండాతో భారీ ర్యాలీ నిర్వహించారు విద్యార్థులు.
77వ గణతంత్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని శ్రీరామ్ నగర్ జేఏసీ ఆధ్వర్యంలో కొండాపూర్‌లో భారీ దేశభక్తి ప్రదర్శన నిర్వహించారు. ఈ వేడుకల్లో భాగంగా విద్యార్థులు, స్థానిక ప్రజలు కలిసి 1000 మీటర్ల పొడవైన త్రివర్ణ పతాకంతో భారీ ర్యాలీని చేపట్టారు. ఈ భారీ ర్యాలీ శ్రీరామ్ నగర్ 1వ లైన్ నుంచి ప్రారంభమై, మసీదుబండలోని బాబా సాహెబ్ అంబేద్కర్ విగ్రహం వరకు కొనసాగింది. వేలాది మంది విద్యార్థులు ఈ జెండా ప్రదర్శనలో పాల్గొని భారత రాజ్యాంగ విలువలను, దేశభక్తిని చాటిచెప్పారు.
