
రంగారెడ్డి: రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలంలోని చౌదరిగుడా గ్రామంలో అర్దరాత్రి దొంగలు బీభత్సం సృష్టించారు. భారీగా బంగారం,వెండి,నగదును ఎత్తుకెళ్ళారు. బాల్ రాజ్, అండాలు అనే దంపతుల ఇంట్లోకి చొరబడిన దొంగలు వారిని బెదిరించి ఎనిమిదిన్నర తులాల బంగారం 46 తులాల వెండి లక్ష ఇరవై వెల రూపాయల నగదు ఎత్తుకెళ్ళారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు,డాగ్ స్క్వాడ్ బృందం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.