
ఖైరతాబాద్ గణేష్ నిమజ్జనం రేపు(మంగళవారం) మధ్యాహ్నం 3 గంటలకు ఖైరతాబాద్ గణేశుడి శోభాయాత్ర ప్రారంభం కానుందని ఖైరతాబాద్ ఉత్సవ నిర్వాహకులు తెలిపారు. టెలిఫోన్ భవన్, తెలుగుతల్లి ఫ్లై ఓవర్, ఎన్టీఆర్ మార్గ్ మీదుగా ట్యాంక్ బండ్‌లోని క్రేన్ నెంబర్ 4 దగ్గరకు ఈ శోభాయాత్ర చేరుకుంటుందని చెప్పారు. ఆ తర్వాత వినాయకుడి నిమజ్జనం జరుగుతుందని తెలిపారు. భక్తుల విజ్ఞప్తితో ప్రతీ ఏదాడి మాదిరిగానే ఈసారి కూడా ఖైరతాబాద్ గణేష్ శోభయాత్ర నిర్వహిస్తున్నామన్నారు. ఊరేగింపునకు భక్తులెవరు రావద్దని పిలుపు నిచ్చారు. శోభాయాత్రకు పోలీసులు సహకరించాలని కోరారు. ఖైరతాబాద్ వినాయకుడి ఊరేగింపునకు పోలీసు బందోబస్తు ఇవ్వకపోయినా, ప్రైవేట్ సెక్యూరిటీతో నైనా శోభాయాత్ర నిర్వహిస్తామని ఖైరతాబాద్ ఉత్సవ నిర్వాహకులు స్పష్టం చేశారు.