ఎల్లంపల్లి నుంచి మూసీకి గోదావరి నీళ్లు .. ఎవరడ్డొచ్చినా ప్రాజెక్టును పూర్తి చేస్తం: సీఎం రేవంత్ రెడ్డి

ఎల్లంపల్లి నుంచి మూసీకి గోదావరి నీళ్లు .. ఎవరడ్డొచ్చినా  ప్రాజెక్టును  పూర్తి చేస్తం: సీఎం రేవంత్ రెడ్డి

 గోదావరి జలాలను   హైదరాబాద్ కు మల్లన్నసాగర్ నుంచి తీసుకురావడం లేదని.. శ్రీ పాద ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి తీసుకొస్తామని చెప్పారు సీఎం రేవంత్ రెడ్డి.  తాటి చెట్టులా పెరిగినా హరీశ్ రావుకు బుద్ధి పెరగలేదని ఫైర్ అయ్యారు. ఎల్లంపల్లి కట్టింది కాంగ్రెస్  ప్రభుత్వమేనని చెప్పారు.

గండిపేటలో గోదావరి తాగునీటి పథకానికి సీఎం రేవంత్ం  శంకుస్థాపన చేశారు. ఫేజ్ 2,ఫేజ్ 3 పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్బంగా మాట్లాడిన సీఎం రేవంత్..  హైదరాబాద్ నగర దాహర్తి తీర్చడానికే ఈ ప్రాజెక్ట్ చేపట్టామని చెప్పారు.  కాంగ్రెస్ ప్రభుత్వాల చొరవ వల్లే హైదరాబాద్ ప్రజల దాహం తీరుతుందని చెప్పారు.  ఎవరడ్డొచ్చినా మూసీ ప్రక్షాళన చేస్తామన్నారు. త్వరలో  మహారాష్ట్ర సీఎంను కలిసి తుమ్మిడి హట్టి దగ్గర ప్రాజెక్టు నిర్మాణంపై చర్చిస్తామని చెప్పారు. తుమ్మిడి హట్టి దగ్గర 150 మీటర్ల ఎత్తులో ప్రాజెక్టు కట్టి తీరుతామని.. రంగారెడ్డి,వికారాబాద్, చేవేళ్లకు సాగునీరందిస్తామన్నారు రేవంత్. కలిసి రావాలని..కడుపుల విషయం పెట్టుకోవద్దని సూచించారు.  కాంగ్రెస్ పై కోపం ఉంటే తనతో కొట్లాడాలి కానీ అభివృద్ధికి అడ్డు పడొద్దని సూచించారు రేవంత్.

 సీఎం రేవంత్ మాట్లాడుతూ..  పదేళ్లు అధికారంలో ఉన్న కేసీఆర్ హైదరాబాద్ కు తాగునీళ్లు అందించాలని ఎందుకు ప్రయత్నించలేదు.  మూసీ పరిసర ప్రాంతాలన్నీ కలుషితం అయ్యాయి.  ఎవరు అడ్డం పడ్డా ఈ ప్రాజెక్టు విషయంలో ముందుకెళ్తాం. రూ. 360 కోట్లతో 20 టీఎంసీల గోదావరి జలాలు  ఉస్మాన్ సాగర్ కు తరలిస్తాం.  హరీశ్ రాకు  తాటిచెట్టులా పెరిగినా మెదడులో గుజ్జు లేదు.  మల్లన్న సాగర్ నుంచి గోదావరి జలాలు తీసుకురావడం లేదు.   శ్రీపాద  ఎల్లంపల్లి నుంచే హైదరాబాద్ కు  నీటిని తరలిస్తాం. మూసీని ప్రక్షాళన చేస్తాం.  త్వరలో మహారాష్ట్ర సీఎంతో మాట్లాడుతా..తుమ్మిడి హట్టి దగ్గర ప్రాజెక్టు నిర్మాణంపై చర్చిస్తాం. తుమ్మిడి హట్టి దగ్గర 150 మీటర్ల ఎత్తులో ప్రాజెక్టు కట్టి తీరుతా. చేవేళ్ల,రంగారెడ్డి,వికారాబాద్ కు సాగునీరందిస్తా. 

హైదరాబాద్ అంటే గొప్ప పేరున్న నగరం. గోదావరి జలాలను మూసీలో సమ్మేళనం చేస్తున్నాం. 1908లో సిటీని వరదలు ముంచెత్తాయి.  వరదలను ఆపడానికి ఆనాడు జంట జలాశయలాలను కట్టారు.  సిటీ దాహం తీరుతుందంటే.. నాడు నిజాం ముందు చూపే.  నేడు హైదరాబాద్ లో కోటికిపైగా జనాభా ఉంది. జనాభా పెరుగుతున్న ప్రతీసారి తాగునీటి  సమస్య వస్తోంది.   ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం కృష్ణా,మంజీరా జలాలను సిటీకి తీసుకొచ్చింది.  వైఎస్సార్ హయాంలో 2002లో శ్రీపాద ఎల్లంపల్లి నుంచి కృష్ణా జలాలను  హైదరాబాద్ కు తీసుకొచ్చారు.  నగరానికి మంచి నీళ్లు ఇవ్వాలన్న ఆలోచన చేసింది నిజాం తర్వాత కాంగ్రెస్సే.  పీజేఆర్ పోరాటంతోనే హైదరాబాద్ కు మంజీరా నీళ్లు వచ్చాయి. హైదరాబాద్ దాహం తీర్చింది కాంగ్రెస్ ప్రభుత్వాలే.  నల్గొండ ప్రజల కోరిక మేరకే మూసీ ప్రక్షాళన చేపడుతున్నాం.  ఈ ప్రాజెక్టుతో మూసీ, నల్గొండ ఫ్లోరైడ్ సమస్యకు పరిష్కారం లభిస్తుందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.