
అమెరికన్స్ కు భారతీయుల పట్ల జాత్యహంకార ద్వేషం ఎంత ఉందో ఈ ఘటన ఒక ఉదాహరణ. అతడు ఇండియన్ అయ్యుండొచ్చు. కానీ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని చెప్పేందుకు అమెరికనే కావాల్సిన పని లేదు కదా. అదే అతను చేసిన తప్పేమో. పబ్లిక్ ప్లేస్ లో యూరిన్ చేయవద్దు అన్నందుకు అకారణంగా భారతీయుడిని పొట్టనపెట్టుకున్నాడు ఓ అమెరికన్. ఈ ఘటన హర్యానా రాష్ట్రంలో తీవ్ర విషాదాన్ని నింపింది.
హర్యానా కు చెందిన 26 ఏండ్ల యువకుడు యూఎస్ కాలిఫోర్నియాలో హత్యకు గురయ్యాడు. అక్కడ మూత్రం పోయవద్దని చెప్పింనందుకు ఏ మాత్రం ఆలోచించకుండా జేబులో ఉన్న గన్ తీసుకుని కాల్చిపారేశాడు దుండగుడు. ఒక్కగానొక్క కొడుకు మాకు దక్కకుండా పోయాడని తల్లిదండ్రులు గుండెలు పగిలేలా ఏడుస్తున్నారు.
మృతుడు హర్యానా రాష్ట్రం జింద్ జిల్లా బరా కలా గ్రామానికి చెందిన కపిల్ (26) గా గుర్తించారు కాలిఫోర్నియా పోలీసులు. ఘటన జరిగిన వెంటనే ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే చనిపోయినట్లు ప్రకటించారు వైద్యులు.
ALSO READ : తెలంగాణలోని ఈ జిల్లాల్లో రెండు రోజులు భారీ వర్షాలు...
కపిల్ 2022లో డుంకీ మార్గంలో అమెరికాకు వెళ్లాడు. అందుకోసం . వ్యవసాయ కుటుంబంలో పుట్టిన అతడు.. పేదరికాన్ని అధిగమించేందుకు అమెరికా వెళ్లి సంపాదించాలని.. అందుకోసం 45 లక్షల రూపాయలు అప్పు చేసి ఖర్చుచేశాడు. కపిల్ ఒక్కడే తమ వారసుడు అని.. తమను పోషించేందుకు అమెరికా వెళ్లి కష్టపడుతున్నాడని అతని తల్లిదండ్రులు తెలిపారు. తమ కొడుకు చనిపోవడంతో దిక్కులేని వాళ్లం అయ్యమని రోదిస్తున్నారు. కపిల్ మృతదేహాన్ని భారత్ తీసుకురావాలని అతని కుటుంబ సభ్యులు వేడుకుంటున్నారు.