తెలంగాణలోని ఈ జిల్లాల్లో రెండు రోజులు భారీ వర్షాలు... హైదరాబాద్ పరిస్థితి ఏంటంటే..?

తెలంగాణలోని ఈ జిల్లాల్లో రెండు రోజులు భారీ వర్షాలు... హైదరాబాద్ పరిస్థితి ఏంటంటే..?

తెలంగాణలోని పలు జిల్లాల్లో రేపు, ఎల్లుండి ( సెప్టెంబర్ 9, 10 ) భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది వాతావరణ శాఖ. రాష్ట్రవ్యాప్తంగా అక్కడక్కడా భారీ వర్షాలు కురుస్తాయని.. మిగతా ప్రాంతాల్లో వాతవరణం పొడిగా ఉంటుందని..సాధారణం కంటే అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని తెలిపింది వాతావరణ శాఖ. హైదరాబాద్ లో అక్కడక్కడా మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని.. మిగతా చోట్ల వాతావరణం పొడిగా ఉంటూ అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని తెలిపింది వాతావరణ శాఖ.

హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో మోస్తరుగా మొదలైన వర్షపాతం క్రమంగా పెరిగి భారీ వర్షాలుగా మారే అవకాశం ఉందని తెలిపింది వాతావరణ శాఖ. వర్షాలు తూర్పు తెలంగాణాలో మొదలై సెంట్రల్ తెలంగాణకు విస్తరించే అవకాశం ఉందని.. మోస్తరుగా మొదలై భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది వాతావరణ శాఖ.

ALSO READ : 9/9/9.. రేపు ఎంతో శక్తివంతమైన రోజు

భారీ వర్షాలు కురిసే సమయంలో ప్రజలు అప్రమత్తంగా ఉదనాలని సూచించింది వాతావరణ శాఖ. వర్ష ప్రభావిత ప్రాంతాల్లో ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటికి వెళ్లోద్దని.. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది వాతావరణ శాఖ.