
జీవితంలో అంకెలు భాగం.. కొత్త వాహనం కొన్నా.. కొత్త ఇల్లు అయినా.. వ్యాపారం అయినా.. ఉద్యోగం అయినా ఏదైనా మంచి రోజుతోపాటు మంచి అంకెతో చూడటం కామన్. కొత్త వాహనం కొంటే 9 నెంబర్ కోసం కోట్ల రూపాయలు ఖర్చు చేస్తాం.. ఏ పని అయినా తొమ్మిది సంఖ్యతో మొదలు పెడితే మంచి జరుగుతుందని విశ్వాసం.. అలాంటి రోజు రానే వచ్చేసింది.
ఇక జ్యోతిష శాస్త్రం ప్రకారం 9 సంఖ్య అనేది ఎంతో శక్తివంతమైంది. కొత్త పనులు ప్రారంభించటానికి తొమ్మిదిని తీసుకుంటారు. ఒక్క తొమ్మిది వస్తేనే ఇంతగా చూసే మనం.. ఆల్ నైన్స్.. అన్నీ తొమ్మిదిలే వస్తే.. అవును 2025, సెప్టెంబర్ 9వ తేదీ ఎంతో శక్తివంతమైన రోజుగా పండితులు చెబుతున్నారు.
- తేదీ: 9వ రోజు
- నెల: సెప్టెంబర్.. 9వ నెల
- సంవత్సరం: 2025.. 2+0+2+5= 9
తొమ్మిదో తేదీ.. తొమ్మిదో నెల.. సంవత్సరం కలిపితే తొమ్మిది.. 9+9+9 మొత్తం 27.. ఈ 27 సంఖ్యను కలిపినా మళ్లీ 9 వస్తుంది. ఈ క్రమంలోనే రేపు.. అంటే సెప్టెంబర్ 9వ తేదీ.. మంగళవారం శక్తివంతమైన రోజు అని.. మొత్తం 9 అంకెతో ముడిపడిన రోజు అంటూ సోషల్ మీడియా డిస్కషన్ నడుస్తుంది.
సంఖ్య శాస్త్రాన్ని పరిగణిస్తే.. తొమ్మిది అంటే జ్ణానం, శక్తి, ధైర్యాన్ని సూచిస్తుంది. ఒక్క తొమ్మిదికే ఇంత పవర్ ఉంటే.. 2025, సెప్టెంబర్ 9వ తేదీ మూడు తొమ్మిది సంఖ్యలు వస్తున్నాయని.. సో.. ఆ రోజు శక్తి మూడు రెట్లు అధికంగా ఉంటుందనేది సంఖ్యా శాస్త్రం చెబుతోంది.
ALSO READ : బరువు తగ్గండి.. డబ్బులు పట్టండి
తొమ్మిది సంఖ్య అనేది శక్తిని మేల్కొలుపుతుంది. అలాంటి రోజును మంచిగా ఉపయోగించుకోవాలనేది సంఖ్య శాస్త్ర నిపుణులు చెబుతున్న మాట. సెప్టెంబర్ 9వ తేదీన పాత ఆలోచనలకు స్వస్తి చెప్పి.. కొత్త ఆలోచనకు కార్యరూపం ఇవ్వాలని సూచిస్తున్నారు.
సెప్టెంబర్ 9వ తేదీ.. మంగళవారం కూడా కావటం మరింత విశేషం. మంగళవారం ఆంజనేయ స్వామి రోజు.. అందులోనూ తొమ్మిది అంకె.. ఆధ్యాత్మికంతోపాటు సంఖ్యా శాస్త్రం కూడా కలిసి రావటంతో.. ఎంతో శక్తివంతమైన రోజు అని.. అందరూ ఆంజనేయస్వామిని ప్రత్యేకంగా ప్రార్థించాలని.. పూజలు చేయాలనేది పండితుల మాట.
09.09.2025న పొరపాటున కూడా ఈ పనులు చేయకండి:
* ఎవరి దగ్గర అప్పు తీసుకోకండి (లేదా) అప్పుగా ఇవ్వకండి
* మీ ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించండి
* జుట్టు, గోర్లు, గడ్డం కత్తిరించవద్దు
* ఇంటి నుంచి ఒంటరిగా బయటకు వెళ్లవద్దు
* ఎవరితోనూ గొడవ పడకండి
* తొందరపడి ఏ పని చేయకండి
* పెట్టుబడి పెట్టడం మానుకోండి
* పదునైన వస్తువులను కొనకండి
* ఒంటరిగా ప్రయాణించడం మానుకోండి
09.09.2025న ఈ పనులు చేయండి
* శారీరక వ్యాయామం చేయండి
* ఇంటి నుంచి బయలుదేరే ముందు బెల్లం తినండి
* ఎరుపు రంగు దుస్తులు ధరించండి
* హనుమంతుడిని పూజించండి
* ఉపవాసం ఉండండి
* ఎరుపు రంగు వస్తువులను దానం చేయండి
* మంగళ మంత్రాన్ని జపించండి