గాఢ నిద్రలో ఉండగా పేలిన ఏసీ.. ఫ్యామిలీలో ఒక్కరు తప్ప అందరూ చచ్చిపోయారు !

గాఢ నిద్రలో ఉండగా పేలిన ఏసీ.. ఫ్యామిలీలో ఒక్కరు తప్ప అందరూ చచ్చిపోయారు !

ఫరీదాబాద్: హర్యానాలోని ఫరీదాబాద్లో విషాద ఘటన జరిగింది. కుటుంబం ఇంట్లో గాఢ నిద్రలో ఉండగా ఏసీ పేలి పెంపుడు కుక్కతో సహా ఆ కుటుంబంలోని ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. భార్యాభర్త, కూతురు, పెంపుడు కుక్క ఈ దుర్ఘటనలో చనిపోగా.. కిటికీలో నుంచి దూకి ఆ చనిపోయిన భార్యాభర్తల కొడుకు ప్రాణాలు దక్కించుకున్నాడు. అర్ధరాత్రి 1.30 గంటల సమయంలో ఏసీ పేలడంతో ఈ విషాదం జరిగింది. నాలుగు అంతస్తుల బిల్డింగ్. ఫస్ట్ ఫ్లోర్లో ఏసీ పేలింది. రెండో ఫ్లోర్ మొత్తం దట్టమైన పొగలు అలుముకున్నాయి. ఊపిరాడక, తప్పించుకునే దారి కానరాక కుటుంబంలోని ముగ్గురు ప్రాణాలు కోల్పోయిన పెను విషాద ఘటన ఇది. ఏసీ పేలిన సమయంలో ఫస్ట్ ఫ్లోర్లోని ఇంట్లో ఎవరూ లేరు.

చనిపోయిన వారిని సచిన్ కపూర్, అతని భార్య రింకూ కపూర్, వారి కూతురు సుజన్ కపూర్గా పోలీసులు గుర్తించారు. చనిపోయిన ముగ్గురూ ఒకే గదిలో నిద్రిస్తుండగా.. సచిన్ కపూర్ కొడుకు వేరే గదిలో పడుకున్నాడు. అందువల్లే అతనికి తప్పించుకునే అవకాశం ఉంది. పొగలు కమ్ముకోగానే భయంతో అతని రూంలోని కిటికీ నుంచి బయటకు దూకేశాడు. సెకండ్ ఫ్లోర్ నుంచి దూకడంతో తీవ్ర గాయాలపాలయ్యాడు. అతని పరిస్థితి కూడా విషమంగానే ఉన్నట్లు వైద్యులు తెలిపారు. పెద్ద శబ్దంతో ఏసీ పేలిందని స్థానికులు తెలిపారు. ఫోర్త్ ఫ్లోర్ లో ఏడుగురితో ఉన్న కుటుంబం నివసిస్తుందని.. థర్డ్ ఫ్లోర్ను సచిన్ కపూర్ తన ఆఫీస్గా వినియోగించుకుంటున్నాడని పొరుగున ఉండే మయాంక్ తెలిపాడు.

ALSO READ : పబ్లిక్ ప్లేస్లో యూరిన్ వద్దన్నందుకు కాల్చి పడేశారు..