రిలేషన్స్ : ఎమోషనల్ బ్లాక్ మెయిలింగ్ ను ఇలా గుర్తించొచ్చు.. ఇలా చేస్తే ప్రాబ్లమ్స్ సాల్వ్..!

రిలేషన్స్ : ఎమోషనల్ బ్లాక్ మెయిలింగ్ ను ఇలా గుర్తించొచ్చు.. ఇలా చేస్తే ప్రాబ్లమ్స్ సాల్వ్..!

లైఫ్ పార్ట్నర్ ను అదుపులో పెట్టుకోవడానికి, ఎదుటి వ్యక్తిని చెప్పుచేతల్లో ఉంచుకోవడానికి ఎమోషనల్ బ్లాక్మెయిలింగ్ ఒక అస్త్రం. చాలామంది ఈ ప్రాబ్లమ్ ఎదుర్కొంటున్నారు. దీనివల్ల వాళ్లే మానసికంగా చాలా ఇబ్బందిపడతారు. ఇది ఎవరికీ చెప్పుకోలేని సమస్య. ఇలాంటి సమస్య ఎదుర్కోవాలంటే కావల్సింది దృఢసంకల్పం.

ఎమోషనల్ బ్లాక్ మెయిలింగా

ఎమోషనల్ బ్లాక్మెయిలింగ్ అంటే ఒక రకమైన బెదిరింపు. తాము చెప్పినట్లు వినకపోతే, చెప్పింది చేయకపోతే, నచ్చినట్లు నడుచుకోకపోతే ఎదుటి వ్యక్తికి హాని చేస్తామని లేదా తమకు తాము హాని చేసుకుంటామని బెదిరించడమే ఎమోషనల్ బ్లాక్ మెయిలింగ్. బాగా దగ్గరి వ్యక్తులమీదే ఎమోషనల్ బ్లాక్ మెయిలింగ్ కు పాల్పడుతుంటారు. ముఖ్యంగా భార్యాభర్తల మధ్య ఎమోషనల్ బ్లాక్ మెయిలింగ్ ఎక్కువగా ఉంటుంది. లవర్స్ మధ్య కూడా ఉంటుంది. దీనివల్ల ఇద్దరిలో ఒకరు బాధపడుతుంటారు. బాధితుల్లో కోపం, భయం. తప్పు చేస్తున్నామనే ఫీలింగ్ వంటివి ఉంటాయి.రోజూ ఇబ్బందిపడతారు.

ఇలా గుర్తించొచ్చు

ఎమోషనల్ బ్లాక్ మెయిలకు గురవుతుంటే ముందుగా బాధితులు అది తెలుసుకోవడం చాలా ముఖ్యం

  • పార్ట్నర్ మిమ్మల్ని ఏదైనా ఇష్టం లేని పని చేయమని బలవంత పెట్టడం.
  • మీకు లేదా ఫ్యామిలీ మెంబర్స్ కు పోలి చేస్తామని బెదిరించడం.
  • రిలేషన్షిప్ ఎక్కువగా సర్దుకుపోవాల్సి రావడం.
  • ఇతరుల సంతోషం కోసం మీరు త్యాగాలు చేయడం
  • ఇష్టమైనవి వదులుకోవాల్సి రావడం.
  • ఎదుటి వ్యక్తి చేసే తప్పుల్ని ప్రశ్నించలేని స్థితిలో
  • ఇవన్నీ ఎమోషనల్ బ్లాక్ మెయిలింగ్కు గురవుతున్నారని సూచనలు. ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు దీనికి పరిష్కారం కనుక్కోవాలి. ఈ సిడ్యుయేషన్ దాటి ముందుకెళ్తేనే లైఫ్ హ్యాపీ గా ఉంటుంది.

కొన్ని ఉదాహరణలు

ఎవరైనా ఒక తప్పు చేసి దొరికిపోయిన సందర్భంలో అది ఎవ్వరికీ చెప్పకుండా ఉండేందుకు, తమతోపాటు తప్పులో భాగస్వాములను చేసేందుకు ఎమోషనల్ బ్లాక్ మెయిలింగ్ను వాడుకుంటాడు. వివాహేతర సంబంధం ఉండి, దాన్ని వదులుకోలేమని బ్లాక్ మెయిల్ చేస్తుంటారు. ఉద్యోగం చేయమని లేదా వదిలేయమని, మద్యపానం, ధూమపానం వంటి చెడు వ్యసనాలకు అలవాటు పడి, వాటిని వదిలేయమని చెప్పిన పార్ట్నరున్ను' కంట్రోల్ చేసేందుకు దీన్ని ఉపయోగిస్తారు.

ఇలా చేయండి

  • ఎమోషనల్ బ్లాక్ మెయిలింగ్ను ఎదుర్కోవడం ఎవరికైనా పెద్ద సమస్యే. ఎందుకంటే ఈ ప్రాబ్లమ్ ఎదురయ్యేది బాగా ఇష్టమైన, దగ్గరి వ్యక్తి నుంచే. అయినప్పటికీ, ఈ పరిస్థితిని దాటాలి. ఇది బాధితుల చేతుల్లోనే ఉంది. బాధితులు నిజాయితీగా ఉండాలి.
  • ఎదుటివ్యక్తి బలహీనతలను, తప్పులను సమర్థించకూడదు. పార్ట్నర్ ఎలా కంట్రోల్ చేస్తున్నారో తెలుసుకోవాలి. ఎన్ని రకాలుగాఇబ్బంది పెడుతున్నారో అర్ధం చేసుకోవాలి.
  • రోజూ ఎదురవుతున్న పరిస్థితుల్ని మరింతగా అంచనా వేసేందుకు ఒక జర్నల్ మెయింటైన్ చేయాలి. పార్టనర్ ఎలా బిహేవ్ చేస్తున్నాడో రాసుకుంటూ ఉంటే. ఒక అంచనాకు. రావొచ్చు.
  • ఎమోషనల్ బ్లాక్మెయిలింగ్కు లొంగుతున్నారంటే తనలోనే ఏమైనా
  • తప్పుందేమో ఆలోచించుకోండి. మీరు గతంలో చేసిన తప్పులు లేదా మీ బలహీనతలు ఎదుటివ్యక్తికి అస్త్రంగా మారాయేమో తెలుసుకోవాలి.
  • ఇంకా ఏదైనా ప్రమాదానికి దారితీసే పరిస్థతి ఉంటే వారిని వారే రక్షించుకోవాలి. పిల్లలు, ఫ్యామిలీ మెంబర్ను కూడా కాపాడుకోవాలి. వాళ్లు ఎలాంటి ఇబ్బందికి గురికాకుండా చూడాలి.
  • సిచ్యుయేషన్ను ఎదుర్కొనేందుకు అవసరమైన వాళ్ల హెల్ప్ అడగటంలో తప్పు లేదు. కుటుంబ సభ్యులు, స్నేహితుల సాయం తీసుకుని, బ్లాక్మెయిలింగ్ను ఎదుర్కోండి. అవసరమైతే థెరపిస్ట్, ఫ్యామిలీ కౌన్సెలర్ను కలవాలి. మాటలతోనే సమస్య తీరాలనుకుంటే పార్ట్నర్ అదేపనిగా డిస్కషన్ చేస్తూ ఉండాలి.
  • పరిస్థితిని బట్టి రిలేషన్షిప్లను బాగు చేసుకోవాలి. 
  • మీ స్వేచ్ఛ, సంతోషం అన్నింటికంటే ముఖ్యం అని తెలుసుకోవాలి.