
తేజ సజ్జా హీరోగా-మంచు మనోజ్ విలన్గా నటించిన లేటెస్ట్ మూవీ ‘మిరాయ్’ (Mirai). ఇందులో తేజ సూపర్ యోధ అవతార్‌లో, మంచు మనోజ్ సైంటిఫికల్ విలన్ రోల్లో కనిపించబోతున్నారు. ఈ మూవీని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వ ప్రసాద్ గ్రాండ్గా నిర్మించారు. కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో తెరకెక్కిన మూవీ సెప్టెంబర్ 12న 2డి, 3డి ఫార్మాట్స్‌లో ఎనిమిది భాషల్లో విడుదల కానుంది.
ఈ సందర్భంగా ఇవాళ (సెప్టెంబర్ 9న) ‘మిరాయ్’ టికెట్ బుకింగ్స్ ఓపెన్ చేశారు. ‘యాక్షన్, ఎమోషన్, అడ్వెంచర్, భక్తి - అన్నీ ఒకే చోట మీకు అందిస్తున్నాము. సెప్టెంబర్ 12న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్. ఇండియాస్ మోస్ట్ అడ్వెంచర్ను పెద్ద స్క్రీన్‌లలో మాత్రమే చూసేయండి’ అని మేకర్స్ ట్వీట్ చేశారు.
#MIRAI BOOKINGS OPEN NOW Exclusively on @district_india 💥💥💥
— People Media Factory (@peoplemediafcy) September 9, 2025
Experience India’s Most Ambitious Action Adventure with your KIDS & FAMILIES Only on the BIG SCREENS ❤️🔥
— https://t.co/wUh7ZlcKM2
GRAND RELEASE WORLDWIDE ON 12th SEPTEMBER 🔥
Superhero @tejasajja123
Rocking Star… pic.twitter.com/SjdiHzN1Pm
సెన్సార్ బోర్డు ఈ సినిమాకు U/A సర్టిఫికెట్‌ను జారీ చేశారు. ఈ చిత్రం నిడివి 169 నిమిషాలు. అంటే దాదాపు 2 గంటల 49 నిమిషాల రన్‌టైమ్‌ను ఫిక్స్ చేశారు. ఇందులో తేజకి మదర్‌గా శ్రియా నటించింది. తల్లీ కొడుకుల ఎమోషన్ హైలైట్‌గా ఉండనుంది. జయరాం అగస్త్య మునిగా, జగపతి బాబు తాంత్రిక గురువు పాత్రలో కనిపిస్తారు. ఈ సినిమాలో VFX మరియు కెమెరావర్క్ ప్రత్యేకంగా నిలిచే అవకాశం ఉంది. ఇకపొతే, ధర్మ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై కరణ్ జోహర్ హిందీలో రిలీజ్ చేస్తున్నారు.