India's Test Team: గిల్ కాదు.. ఇండియన్ టెస్ట్ టీమ్‌లో ఆ ఒక్కడే మ్యాచ్ విన్నర్: ఇంగ్లాండ్ మాజీ క్రికెటర్

India's Test Team: గిల్ కాదు.. ఇండియన్ టెస్ట్ టీమ్‌లో ఆ ఒక్కడే మ్యాచ్ విన్నర్: ఇంగ్లాండ్ మాజీ క్రికెటర్

ఈ ఏడాది ఇంగ్లాండ్ తో టెస్ట్ సిరీస్ కు ముందు భారత జట్టు తీవ్ర ఒత్తిడిలో ఉంది. కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ టెస్ట్ సిరీస్ కు ముందు రిటైర్మెంట్ ప్రకటించడమే అందుకు కారణం. విదేశాల్లో అనుభవం లేకుండా వెళ్లిన ఇండియాకు చేదు అనుభవమే మిగులుతుందని చాలామంది భావించారు. అయితే అందరి అంచనాలను తల్లక్రిందులు చేస్తూ భారత్ జట్టు 5 మ్యాచ్ ల టెస్ట్ సిరీస్ ను 2-2 తో సమం చేయగలిగింది. 25 ఏళ్లకే టెస్ట్ జట్టుకు కెప్టెన్సీ అందుకున్న శుభమాన్ గిల్ జట్టును అద్భుతంగా నడిపించాడు. తన బ్యాటింగ్, కెప్టెన్సీతో జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషించాడు. 

విరాట్ కోహ్లీ వారసుడిగా ఇండియన్ క్రికెట్ లో గిల్ పాతుకుపోవడం గ్యారంటీ అనే ప్రశంసలు వినిపిస్తున్నాయి. కెప్టెన్ గా తొలి సిరీస్ లోనే 754 పరుగులతో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గా నిలిచిన గిల్ భారత జట్టును అద్భుతంగా నడిపించగలడనే నమ్మకం కల్పించాడు. అయితే ఇంగ్లాండ్ మాజీ వికెట్ కీపర్ గిల్ కంటే వికెట్ కీపర్ బ్యాటర్ రోలాండ్ బుచర్.. ఇండియా టెస్ట్ బ్యాటర్లలో రిషబ్ పంత్ మ్యాచ్ విన్నర్ అని తన అభిప్రాయాన్ని తెలిపాడు. ప్రస్తుతం భారత జట్టులో బ్యాట్‌తో ఉన్న ఏకైక మ్యాచ్ విన్నర్ రిషబ్ పంత్ అని ఈ ఇంగ్లాండ్ మాజీ భావిస్తున్నాడు. భారత జట్టులో మంచి ఆటగాళ్లు ఉన్నప్పటికీ రిషబ్ పంత్ తప్పితే “మ్యాచ్ విన్నర్లు” లేరని బుచర్ తెలిపాడు. 

►ALSO READ | Asia Cup 2025 Hockey: 8 ఏళ్ళ తర్వాత ఆసియా కప్ సొంతం.. భారత జట్టుకు హాకీ ఇండియా ప్రైజ్ మనీ ప్రకటన

"రాబోయే రెండు సంవత్సరాలు టీమిండియాకు మ్యాచ్ విన్నర్లు అవసరం. ఇండియా జట్టులో మ్యాచ్ విన్నర్లను కనుగొనాలి. ప్రస్తుతానికి టీమిండియాలో ఉన్న ఏకైక మ్యాచ్ విన్నర్ రిషబ్ పంత్. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ జట్టులో లేకపోవడం పెద్ద నష్టం కానుంది. నావరకైతే వీరి ఇద్దరి లోటును ఇంకా ఎవరూ భర్తీ చేయలేదని భావిస్తున్నాను. వీరి కంటే బెటర్ గా ఎవరూ ఆడలేదని అనుకుంటున్నాను. ఎందకంటే కొన్ని సంవత్సరాలుగా వారు ఎంత డేంజరస్ బ్యాటర్లు అనే విషయం వారి ట్రాక్ రికార్డ్ చూస్తే అర్ధమవుతోంది. వారిద్దరూ వరల్డ్ క్రికెట్ లో అత్యుత్తమ ఆటగాళ్లు". అని రోలాండ్ బుచర్ చెప్పుకొచ్చాడు.