
ఉత్తర్ ప్రదేశ్ లోని ఘాజియాపూర్ లో వింత ఘటన చోటు చేసుకుంది. గంగానదిలో భారీ రాయి తేలుతూ కనిపించింది. సుమారు 3 క్వింటాళ్ల బరువున్న రాయి నీటిపై తేలుతూ కనిపించడంతో ఇది శ్రీరాముడి లీల అంటూ పూజలు చేస్తున్నారు జనం. ఇందుకు సంబందించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది. విన్న ఎవరికైనా ఆశ్చర్యాన్ని కలిగించే ఈ ఘటనకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి..
ఉత్తర్ ప్రదేశ్ లోని ఘాజియాపూర్ లో గంగానదిలో భారీ రాయి తేలుతున్న వీడియో నెట్టింట వైరల్ గా మారింది. సుమారు 3 క్వింటాళ్ల బరువున్న రాయి నీటిపై అలవోకగా తేలడం చూసి ఆశ్చర్యపోయిన స్థానికులు ఇది శ్రీరాముడి లీల అంటూ పూజలు ప్రారంభించారు. ఈ రాయికి రామసేతుతో సంబంధం ఉందని అంటున్నారు భక్తులు.నదిలో తేలుతున్న రాయిని ఒడ్డుకు తీసుకొచ్చి తాడుతో కట్టి పూజలు చేస్తున్నారు భక్తులు.
#Watch | वाराणसी से गाजीपुर के बीच गंगा में एक अचंभित करने वाली घटना हुई है। यहां पर गंगा की बीच धारा में एक विशाल पत्थर तैरता हुआ मिला है। नाविकों ने पत्थर को रस्सी से बांधकर किनारे खींच लिया है। इसकी जानकारी मिलने पर महिलाओं ने पत्थर पर पूजा-पाठ भी शुरू कर दिया है। #Varanasi pic.twitter.com/lv1m13krdL
— Hindustan (@Live_Hindustan) July 18, 2025
గంగానదిలో తేలుతున్న రాయి త్రేతాయుగం కాలం నాటిదని కొంతమంది.. విష్ణువు, శివుడికి సంకేతమని మరికొంతమంది అభిప్రాయపడుతున్నారు. అయితే కొంతమంది మాత్రం.. ఈ రాయికి దైవంతో ఎలాంటి సంబంధం లేదని, ఇది అగ్నిపర్వత లావాలో ఏర్పడ్డ ప్యూమిస్ రాయి అని అంటున్నారు. ప్యూమిస్ రాళ్ళు నీటిలో తేలుతాయని సోషల్ మీడియాలో పలువురు నెటిజన్స్ కామెంట్ చేస్తున్నారు.
Also Read:-ఈ టార్చర్ భరిస్తూ బతకలేను: ప్రొఫెసర్ వేధింపులతో మరో విద్యార్థిని సూసైడ్
ఈ ఘటనపై సోషల్ మీడియాలో మిశ్రమ స్పందనలు వస్తున్నాయి.. కొంతమంది దీనికి దైవం, పురాణాలతో సంబంధం ఉందని వాదిస్తుంటే మరికొంతమంది సైంటిఫిక్ రీజన్స్ తో వారి వాదనను కొట్టిపడేస్తున్నారు.