ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు ఏపీ నంద్యాల జిల్లా శ్రీశైలం జలాశయానికి భారీగా వరద నీరు చేరుతోంది. దీంతో ప్రాజెక్ట్ ఒక గేట్ ను 10 అడుగుల మేర ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు అధికారులు.
ప్రాజెక్ట్ లోకి లక్షా 29 వేల 562 క్యూసెక్యులు ఇన్ ఫ్లో వస్తుండగా, ఔట్ ఫ్లో 95 వేల 699 క్యూసెక్యులుగా ఉంది. డ్యామ్ పూర్తి స్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా.. ప్రస్తుతం నీటిమట్టం 884 అడుగులు ఉంది. ప్రాజెక్ట్ కుడి,ఎడమ జల విద్యుత్ కేంద్రాల నుంచి విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోంది.