హంగేరియన్‌‌ బ్రిటిష్‌‌ రచయిత డేవిడ్‎కు బుకర్‌‌‌‌ ప్రైజ్‌‌

హంగేరియన్‌‌ బ్రిటిష్‌‌ రచయిత డేవిడ్‎కు బుకర్‌‌‌‌ ప్రైజ్‌‌

లండన్: హంగేరియన్‌‌ బ్రిటిష్‌‌ రచయిత డేవిడ్‌‌ సలాయ్‌‌ ప్రతిష్టాత్మక బుకర్‌‌‌‌ ప్రైజ్‌‌ గెలుచుకున్నారు. ఆయన రాసిన ఫ్లెష్‌‌ నవలకు ఈ అవార్డు దక్కింది. మంగళవారం లండన్‌‌లో జరిగిన కార్యక్రమంలో గతేడాది బుకర్‌‌‌‌ ప్రైజ్‌‌ విజేత సమంతా హార్వే చేతులమీదుగా డేవిడ్‌‌ సలాయ్‌‌ 50 వేల ఫౌండ్ల ప్రైజ్‌‌మనీ, ట్రోఫీ అందుకున్నారు. ఈ పోటీలో మన దేశ మూలాలున్న అమెరికన్‌‌ రచయిత కిరణ్ దేశాయ్ రాసిన ‘ది లోన్లీనెస్ ఆఫ్ సోనియా అండ్ సన్నీ’ నవల రెండో స్థానంలో నిలిచింది. 

2006లో ‘ది ఇన్‌‌హెరిటెన్స్ ఆఫ్ లాస్’ అనే పుస్తకం రాసి బుకర్ ప్రైజ్‌‌ గెలుచుకున్న కిరణ్‌‌ దేశాయ్‌‌, ఈసారి గెలిస్తే రెండుసార్లు ప్రైజ్‌‌ తీసుకున్న ఐదో వ్యక్తిగా చరిత్రలో నిలిచేవారు. మొత్తం 153 నవలలు 2025 బుకర్‌‌‌‌ ప్రైజ్‌‌ కోసం పోటీ పడగా ఐరిష్‌‌ రైటర్‌‌‌‌ రాడీ డోయల్‌‌, సారా జెస్సికీ పార్కర్‌‌‌‌ నేతృత్వంలోని జడ్జిల ప్యానెల్‌‌ డేవిడ్‌‌ రాసిని ఫ్లెష్‌‌ నవలను ఫైనల్ విజేతగా ప్రకటించారు.