రాగల 24 గంటల్లో తీవ్ర తుఫాన్‌గా మారనున్న 'యాస్‌'

రాగల 24 గంటల్లో తీవ్ర తుఫాన్‌గా మారనున్న 'యాస్‌'

రాబోయే 24 గంటల్లో యాస్‌ తుఫాను తీవ్ర తుఫానుగా మారే అవకాశం ఉందని వాతావరణ విభాగం ఇవాళ(సోమవారం) తెలిపింది. పశ్చిమ బెంగాల్‌, ఒడిశా తీరాల్లో బుధవారం తీరం దాటుతుందని తెలిపింది. ఈ సమయంలో 180 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని ప్రకటించింది. పశ్చిమ తీరంలో తౌక్టే తుఫాన్‌లా ఇది కూడా తీవ్రంగా మారే అవకశాలున్నాయని అధికారులు అంచనావేస్తున్నారు.

ప్రస్తుతం తుఫాన్‌ పోర్ట్‌ బ్లెయిర్‌కు 600 కిలోమీటర్ల దూరంలో ఉందని తెలిపింది వాతావరణ విభాగం. ఈ తుఫాన్‌ కారణంగా ఒడిశా, బెంగాల్‌ రాష్ట్రాలు హైఅలర్ట్‌ను ప్రకటించాయి. ఈ రెండు రాష్ట్రాల్లో NDRF, సైన్యం, కోస్టల్‌ గార్డ్ ను మోహరించారు. ఈ తుఫాను కారణంగా ప్రభావితమైన ఇతర రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్‌,తమిళనాడుతో పాటు అండమాన్‌ నికోబార్‌ దీవులకు కూడా NDRF  టీంలను తరలించారు.