అప్పు చేసిందని భార్యపై భర్త కత్తితో దాడి

అప్పు చేసిందని భార్యపై భర్త కత్తితో దాడి
  • జవహర్ నగర్ పీఎస్ పరిధిలో ఘటన

జవహర్ నగర్, వెలుగు: భార్య మితిమీరిన అప్పు చేసిందని భర్త ఆగ్రహం చెంది కత్తితో దాడి చేసిన ఘటన జవహర్ నగర్ పీఎస్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన ప్రకారం.. ఏపీలోని గుంటూరు జిల్లాకు చెందిన మేడ పెద్దబ్బాయి, ఇందిర దంపతులు ఆరేండ్ల కిందట సిటీకి వచ్చి జవహర్ నగర్ పరిధి సంతోశ్​నగర్ లో ఉంటున్నారు. స్థానికంగా నాటు కోళ్లు అమ్ముతూ జీవిస్తున్నారు. ఇందిరా భర్తకు తెలియకుండా రూ. 4 లక్షల అప్పు చేసింది. దీంతో భార్యతో భర్త వాగ్వాదానికి దిగాడు. తీవ్ర కోపంతో తమ షాపులోని కత్తితో పెద్దబ్బాయి తన భార్యపై చేతులపై, తలపైన, చాతిపైన దాడి చేయగా తీవ్ర గాయాలు అయ్యాయి. వెంటనే స్థానికులు 108 అంబులెన్స్ కు ఫోన్ చేసి బాధితురాలిని మెరుగైన చికిత్స నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు.  బాధితురాలి ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన జవహర్ నగర్ పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేపట్టారు.