భార్యను చంపి ఫొటోతో వాట్సాప్ స్టేటస్.. తమిళనాడులో ఘోరం

భార్యను చంపి ఫొటోతో వాట్సాప్ స్టేటస్.. తమిళనాడులో ఘోరం

చెన్నై: కోయంబత్తూరులో దారుణం చోటుచేసుకుంది. మరో వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకుందనే అనుమానంతో కట్టుకున్న భార్యను దారుణంగా నరికి చంపాడో భర్త.. ఆపై మృతదేహంతో ఫొటో దిగి తన వాట్సాప్ స్టేటస్ గా పెట్టుకున్నాడు. కోయంబత్తూరులోని ఓ హాస్టల్ లో జరిగింది. శ్రీప్రియ, బాలమురుగన్  భార్యాభర్తలు. మనస్పర్ధల వల్ల ఇద్దరూ కొంతకాలంగా విడిగా ఉంటున్నారు. 

శ్రీప్రియ ఓ ప్రైవేటు కంపెనీలో పనిచేస్తూ హాస్టల్​లో ఉంటోంది. శ్రీప్రియపై అనుమానం పెంచుకున్న బాలమురుగన్.. ఆమె వేరే వ్యక్తితో కలిసి ఉంటోందని ఆగ్రహించాడు. ఈ క్రమంలోనే ఆదివారం హాస్టల్​కు వెళ్లి శ్రీప్రియను కలిశాడు. మరోమారు ఇద్దరి మధ్య గొడవ జరగగా.. వెంట తెచ్చుకున్న కొడవలితో బాలమురుగన్ తన భార్య శ్రీప్రియను నరికి చంపాడు. హాస్టల్ నిర్వాకుల సమాచారంతో అక్కడికి చేరుకున్న పోలీసులు.. బాలమురుగన్​ను అదుపులోకి తీసుకుని స్టేషన్ కు తరలించారు.