కట్నం వేధింపుల చావులో.. ఆ కుటుంబం మొత్తానికి జీవితకాల జైలు శిక్ష

కట్నం వేధింపుల చావులో.. ఆ కుటుంబం మొత్తానికి జీవితకాల జైలు శిక్ష

కట్నం కోసం వేధించిన కేసులో ఓ కుటుంబం మొత్తానికి  జీవిత ఖైదు శిక్ష  పడింది. ఉత్తర్​ప్రదేశ్​రాష్ట్రంలోని జిల్లా కోర్టు వెలువరించిన తీర్పు తాలూకు కేసు పూర్వాపరాలివే.. భదోహిలోని బార్జి గ్రామానికి చెందిన ప్రకాష్​ ఉపాధ్యాయ్ కి ఓ మహిళతో 2016లో వివాహం జరిగింది. 

అప్పటి నుంచి భర్త, మామ శివబాలి, అత్త  జ్ఞానమతి దేవి కోడలిను అదనపు కట్నం కోసం వేధించేవారు. దీంతో తరచూ వారి మధ్య గొడవలు జరిగేవి. పెద్దలు సర్ది చెప్పినా కుటుంబ సభ్యులు వినేవారు కాదు. 

చివరికి ఆమెను చంపేయాలని తల్లిదండ్రులు, భర్త నిర్ణయించుకొని హత్యకు ప్లాన్​ వేశారు. 2016 ఆగస్టు 19న పెట్రోల్​పోసి నిప్పంటించి వివాహితను కిరాతకంగా హత్య చేశారు. 

బాధిత మహిళ తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు దోషులపై కేసు నమోదు చేశారు. అప్పటి నుంచి విచారణ సాగుతుండగా ఆగస్టు 24న జిల్లా కోర్టు కీలక తీర్పు వెలువరించింది. 

హత్య చేసింది భర్త, అత్తమామే అని నిర్ధారణ కావడంతో కోర్టు వారికి జీవిత ఖైదు, ఒక్కొక్కరికి రూ.11 వేల జరిమానా విధించింది.