డాడీని జైలులో పెట్టండి.. పోలీసులను కోరిన చిన్నారి 

V6 Velugu Posted on Nov 17, 2021

మద్యం మత్తులో భార్యను కత్తెరతో పొడిచాడు భర్త. భార్యకు తీవ్ర గాయాలవ్వడంతో స్థానికులు ఆమెను ఏరియా హాస్పిటల్‌కు తరలించారు. కరీంనగర్ జిల్లా హుజురాబాద్‌‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. జమ్మికుంట రోడ్డులో ఉండే ఆర్టీసీ కండక్టర్ రమేష్ కుటుంబ కలహాలతో భార్య ప్రియదర్శినిని కత్తెరతో పొడిచాడు. దీంతో రమేష్‌‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కుమారుడు సాయి చందర్.. తండ్రి తాగొచ్చి గొడవ చేస్తాడని పోలీసులకు చెప్పాడు. అమ్మను రోజూ కొడతాడని, ఆయన్ను జైలులో పెట్టండన్నాడు. డబ్బులు తీసుకుని పారిపోతాడని.. త్వరగా వెళ్లి పట్టుకోవాలని ఐదేళ్ల బాబు పోలీసులను కోరాడు. 

 

Tagged POLICE, HUSBAND, Wife, Alcohol, Huzurabad, intoxication, stabs, Stabbing

Latest Videos

Subscribe Now

More News