నేటి సాయంత్రం నుంచి ప్రచారం బంద్​

V6 Velugu Posted on Oct 27, 2021

కరీంనగర్‍ సిటీ, వెలుగు: హుజూరాబాద్ ఉప ఎన్నికలు ఈ నెల 30న జరగనున్నందున పోలింగ్ కు 72 గంటల ముందు ప్రచారం ముగించాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఆర్వీ. కర్ణన్ ఒక ప్రకటనలో తెలిపారు. ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు హుజూరాబాద్ నియోజకవర్గంలో అక్టోబర్ 27 సాయంత్రం 7- గంటల నుంచి అక్టోబర్ 30 వరకు సైలెన్స్ పిరియడ్ అని తెలిపారు. ఆ టైంలో రాజకీయ పార్టీలు ప్రజలను ప్రచారానికి  సమీకరించరాదని, మీడియా కార్యక్రమాలు నిర్వహించరాదని, ఎన్నికలకు సంబంధించిన ప్రచార సభలు, సమావేశాలు, బహిరంగ సభలు, ర్యాలీలు నిర్వహించరాదని పేర్కొన్నారు. ఎన్నికల రూల్స్​ ఉల్లంఘించిన వారిపై  రెండేండ్ల శిక్ష, ఫైన్  లేక రెండూ విధిస్తారని హెచ్చరించారు.

Tagged Campaign, , Huzurabad by-election

Latest Videos

Subscribe Now

More News