హుజురాబాద్ లో పోటీ గెల్లుతో కాదు‌.‌. కేసీఆర్ తోనే..

హుజురాబాద్ లో పోటీ గెల్లుతో కాదు‌.‌. కేసీఆర్ తోనే..
  • ఈటల 200 ఎకరాలు కష్టపడి సంపాదించుకున్నడు
  • 2వేల ఎకరాలు అక్రమంగా సంపాదించిన కేసీఆర్ తోనే పోటీ
  • హుజూరాబాద్ లో 200 ఎకరాలు.. వర్సెస్ 2000 ఎకరాల మధ్యే పోటీ
  • బీజేపీ కోర్ కమిటీ సభ్యుడు వివేక్ వెంకటస్వామి

కరీంనగర్: హుజూరాబాద్ ఉప ఎన్నికలో బీజేపీ పోటీ గెల్లు శ్రీనివాస్ తో కాదని.. 2 వేల ఎకరాలు అక్రమంగా సంపాదించిన కేసీఆర్ తోనే పోటీ అని మాజీ ఎంపీ, బీజేపీ బీజేపీ కోర్ కమిటీ సభ్యుడు వివేక్ వెంకటస్వామి పేర్కొన్నారు. ఈటల రాజేందర్ 200 ఎకరాలు సంపాదించాడని పదేపదే చెబుతున్న హరీష్ రావు ఆయన కష్టపడి సంపాదించుకున్న ఆస్తులని మరచిపోతున్నారని అన్నారు. రెండు గుంటల గెల్లుకు.. 200 ఎకరాల ఈటల మధ్యే పోటీ అని హరీష్ రావు చెప్పడం హాస్యాస్పదం అని.. వాస్తవానికి 2 గుంటల గెల్లు శ్రీనివాస్ వెనుక ఉండి చేయిస్తున్నది 2 వేల ఎకరాల కేసీఆర్ అన్నారు. కాబట్టి హుజూరాబాద్ లో 200 ఎకరాలు వర్సెస్ 2 వేల ఎకరాల మధ్యే పోటీ జరుగుతోందని వివేక్ వెంకటస్వామి వివరించారు. గురువారం హుజూరాబాద్ లో బీజేపీ జిల్లా అధ్యక్షులు గంగాడి కృష్ణారెడ్డి తదితరులతో కలసి మీడియాతో మాట్లాడారు. 
‘‘పాదయాత్ర ముందు నేను ఈటలపై సర్వే చేయించాను‌. ఎక్కడికి వెళ్ళినా ఆయన పట్ల మంచి స్పందన వస్తోంది. ఈటల వర్సెస్ కేసీఆర్ పోటీలో ఈటల గెలుపు ఖాయం. పాదయాత్రలో ఈటల  రాజేందర్ కు మంచి స్పందన, మంగళ హారతులతో స్వాగతం పలుకుతున్నారు. రోజురోజుకు ఈటలపై ప్రజాదరణ పెరుగుతోంది..’’ అని బీజేపీ కోర్ కమిటీ సభ్యుడు వివేక్ వెంకటస్వామి అన్నారు. ఈటల బీజేపీలోకి పోడని కేసీఆర్ అనుకున్నాడు, కానీ ఈటెల రాజేందర్ బీజేపీలో చేరాక కేసీఆర్ కు భయం పట్టుకుందని, అందుకే సొంత నాయకులనే కొంటూ అక్రమంగా గెలవాలని చూస్తున్నారని ఆయన ఆరోపించారు. రాజకీయ వ్యవస్థను కేసీఆర్ నాశనం చేశారని, ప్రజల ప్రేమ ముందు ఎన్ని డబ్బులు ఖర్చు పెట్టినా లాభం లేదని గుర్తుంచుకోవాలని ఆయన సూచించారు. 
ఈటల గెలిస్తే హుజూరాబాద్ పథకాలు రాష్ట్రమంతా వస్తాయి
ఈటలకు ఓటేస్తే ప్రజలకు లాభం లేదని హరీష్ రావు అంటున్నారు, కానీ ఈటెల గెలిస్తే ప్రజలకి లాభం జరుగుతుంది, హుజరాబాద్ లో వచ్చిన ఇలాంటి పథకాలు రాష్ట్రం అంతట వస్తాయని మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి పేర్కొన్నారు. ఈటల వల్లే కేసీఆర్ ఫాం హౌస్ నుంచి ఈటల వల్లే బయటకు వచ్చాడు‌, ఈటల రాజీనామా వల్లే హుజురాబాద్ కు ఇన్ని కోట్ల నిధులు వస్తున్నాయని తెలిపారు. 
చెన్నూరులో సుమన్ కొడుకు లాంటి వాడన్నారు
సీఎం కేసీఆర్ చెన్నూరులో సుమన్ కొడుకు లాంటి వాడన్నారు, కానీ చెన్నూరు లో ఎలాంటి పనులు చేయలేదని బీజేపీ కోర్ కమిటీ సభ్యుడు వివేక్ వెంకటస్వామి ఆరోపించారు. తన నియోజకవర్గాన్ని పట్టించుకోకుండా బాల్కసుమన్ ఇక్కడికొచ్చి ప్రగల్భాలు పలుకుతున్నారని ఆయన విమర్శించారు. కొడుకు లాంటి వాడివి కదా ఎందుకు  కేసీఆర్ తో చెప్పి చెన్నూరు నియోజకవర్గాన్ని డెవలప్ చేయడం లేదు అని ఆయన ప్రశ్నించారు. ఈటల గెలిస్తేనే ప్రజలు గెలుస్తారని, లేదంటే కేసీర్ మరిన్ని అక్రమాస్తులు సంపాదించుకుంటాడని ఆయన హెచ్చరించారు. 
సింగరేణిలో 18 వేల ఉద్యోగాలు బర్తరఫ్ చేశారు
ఇంటికో ఉద్యోగం అని చెప్పి ఉన్న ఉద్యోగాలు తీసేశారని బీజేపీ కోర్ కమిటీ సభ్యుడు వివేక్ వెంకటస్వామి ఆరోపించారు. ఇంటికో ఉద్యోగం ఇస్తానన్న ముఖ్యమంత్రి మోసం చేశాడని ఆయన విమర్శించారు. సింగరేణిలో 18 వేల ఉద్యోగాలు బర్తరఫ్ చేశారని, నిజాం షుగర్స్ ఫ్యాక్టరీ తెరుస్తామని చెప్పిన హామీ ఏమైందని ఆయన ప్రశ్నించారు. మోడీ 8వేల కోట్లతో రామగుండం ఎరువుల కర్మాగారం తెరిపించి 5వేల ఉద్యోగాలు ఇచ్చారని వివేక్ వెంకటస్వామి గుర్తు చేశారు. మరో వైపు కేసీఆర్  ఉన్న పరిశ్రమలు మూయిస్తున్నాడన్నారు. గతంలో హరీష్ రావు రామగుండం ఎరువుల ఫ్యాక్టరీ కి వచ్చినప్పుడు ఫ్యాక్టరీ తెరిపించేందుకు వివేక్ ఎంతో కృషి చేశారని మెచ్చుకున్నారని ఆయన గుర్తు చేశారు. 
ఓట్లు ఉన్నప్పుడే ఉద్యోగ నోటిఫికేషన్ ప్రకటనలు
కేసీఆర్ ఓట్లు ఉన్నప్పుడే ఉద్యోగ నోటిఫికేషన్ ప్రకటనలు చేస్తాడని.. ఆ తర్వాత మర్చిపోవడం అలవాటని బీజేపీ కోర్ కమిటీ సభ్యుడు వివేక్ వెంకటస్వామి విమర్శించారు. ఏనాడు దళితుల కోసం మాట్లాడని కేసీఆర్ ఇప్పుడు ఓట్లకోసం దళిత బంధు తెచ్చాడని, నిజంగా దళితులపై ప్రేమ ఉంటే వచ్చే ముఖ్యమంత్రి తన కొడుకు కాదు, దళితుడే అని కేసీఆర్ ప్రకటించాలని ఆయన సవాల్ చేశారు. గెల్లు శ్రీనివాస్ కు 2గుంటలు, ఈటలకు 200 ఎకరాలంటున్నరు‌‌ హరీష్ రావు, ఈటల కష్టపడి సంపాదించుకున్న భూములవి, పన్నులు కూడా కడుతుండు, హుజురాబాద్ లో పోటీ గెల్లు శ్రీనివాస్ తో కాదు‌‌,  2000 ఎకరాలు అక్రమంగా సంపాదించిన కేసీఆర్ తోనే పోటీ అని వివేక్ వెంకటస్వామి పునరుద్ఘాటించారు. హుజూరాబాద్ లో పోటీ 2000 ఎకరాలు వర్సెస్ 200 ఎకరాల మధ్య పోటీ అన్నారు. 
ఉద్యమకారులంటే కేసీఆర్ కు కోపం
ఉద్యమకారులంటే కేసీఆర్ కు చాలా కోపమని, అందుకే ఓడిపోయే సీటు ఉద్యమకారుడైన గెల్లు శ్రీనివాస్ కు ఇచ్చారని బీజేపీ కోర్ కమిటీ సభ్యుడు వివేక్ వెంకటస్వామి పేర్కొన్నారు. గతంలో అమరవీరుడు శ్రీకాంతాచారి తల్లి శంకరమ్మ కు హుజూర్ నగర్ లో నిల్చోబెట్టి  ఓడించారని ఆయన గుర్తు చేశారు. మానుకోటలో ఉద్యమకారులపై రాళ్లు వేసిన కౌశిక్ రెడ్డికి ఇచ్చిన ఎమ్మెల్సీ పదవి గెల్లు శ్రీనివాస్ కు ఎందుకు ఇవ్వలేదని ఆయన నిలదీశారు. ప్రజలకు డబుల్ బెడ్ ఇండ్లు కట్టకపోయినా.. తన కుటుంబ సభ్యుల కోసం కేసీఆర్ ఫాం హౌసులు కట్టుకున్నారని ఆయన ఆరోపించారు. కేసీఆర్ ప్రాజెక్టుల పేరుతో ఇరిగేషన్ దందాలు చేస్తున్నాడని,‌ కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా వచ్చిన కమిషన్ల డబ్బులతో ఓట్లను కొంటున్నారని, రాష్ట్రాన్ని కేసీఆర్ అప్పుల పాలు చేస్తున్నారని ఆయన ఆరోపించారు. 
హుజూరాబాద్ లో లక్ష ఓట్లతో ఈటల గెలుపు
హుజురాబాద్ ప్రజలు లక్ష ఓట్లతో ఈటలను గెలిపించడం ఖాయమని బీజేపీ కోర్ కమిటీ సభ్యుడు వివేక్ వెంకటస్వామి ధీమా వ్యక్తం చేశారు. బీజేపీ నేతలంతా సమైక్యంగా ఈటలను గెలిపించుకుంటామన్నారు. జిహెచ్ఎంసి ఎన్నికల్లో కేటీఆర్ ఇంచార్జి గా ఉండడం పార్టీ ఓడిపోయిందని గుర్తు చేస్తూ.. కేసీఆర్ పై ప్రజలకు నమ్మకం లేదన్నారు.  హుజరాబాద్ ఇంచార్జ్ బాధ్యతలు హరీష్ రావుకు ఇచ్చారని, ఇప్పటికే దుబ్బాక లో హరీష్ రావు ఇంఛార్జి తీసుకుంటే ఓడిపోయిందని, ఇక్కడ కూడా ఓడిపోతే హరీష్ రావును బాధ్యున్ని చేసే ఆలోచనలో కేసీఆర్ ఉన్నాడని వివేక్ వెంకటస్వామి విమర్శించారు.