పోలింగ్ సెంటర్ పక్క వీధిలోనే టీఆర్ఎస్ ఇంచార్జులు..

పోలింగ్ సెంటర్ పక్క వీధిలోనే టీఆర్ఎస్ ఇంచార్జులు..

జమ్మికుంట పట్టణంలోని డిగ్రీ  కాలేజీ సెంటర్ లో టీఆర్ఎస్ నేతలు డబ్బులు పంచుతుండగా అడ్డుకున్నారు బీజేపీ నాయకులు. టీఆర్ఎస్ ఇంచార్జులు అక్కడే ఉండి డబ్బులు పంపిణీ చేయడంపై మండిపడ్డారు. దీంతో బీజేపీ, టీఆర్ఎస్ నాయకుల మధ్య గొడవ జరిగింది. ఒకరిని ఒకరు తోసుకోవడంతో ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది.

ఈవీఎంల మెరాయింపు :  ప్రలోభాలకు గురిచేస్తున్న టీఆర్ఎస్ నేత

హుజురాబాద్ ఉప ఎన్నికకు బై పోల్ 7 గంటలకే ప్రారంభం కాగా..  హుజురాబాద్ లోని ఇల్లందకుంట శ్రీరాములపల్లిలో గొడవ జరిగింది. ఇల్లందుకుంటలోని పోలింగ్ కేంద్రం 224  బూత్ లో ఈవీఎం మెరాయింపుతో పోలింగ్ ఆలస్యం అవుతుంది. అయితే ఈ విషయంపై ఓ టీఆర్ఎస్ లీడర్ అసత్య ప్రచారం చేయడంతో  లైన్లో ఉన్న కొంతమంది ఓటర్లు వెనుదిరగడంతో అక్కడ గొడవ జరిగింది. ఓటర్లను ప్రలోభాలకు గురి చేస్తున్న టీఆర్ఎస్ ఇంచార్జ్, గజ్వేల్ మార్కెట్ ఛైర్మన్ మాదాసు శ్రీనివాస్ తో గొడవకు దిగారు గ్రామ ప్రజలు. ఒకవైపు పోలింగ్ జరుగుతుండగా.. ఊళ్లోకి ఎందుకొచ్చావని ప్రశ్నించారు. దీంతో టీఆర్ఎస్ నాయకులు అక్కడి నుండి వెనుదిరిగి వెళ్లిపోయారు.