
హుజురాబాద్ లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు బీజేపీ నేతలు. కమలాపూర్ మండల కేంద్రంలో బీజేపీ జాతీయ కార్యదర్శి వివేక్ వెంకటస్వామితో కలిసి ఇంటింటి ప్రచారంలో పాల్గొన్నారు బీజేపీ నాయకురాలు గండ్ర నళిని. ఇంటింటికి వెళ్లి ఓటర్ల అభిప్రాయాలు తెలుసుకున్నారు.మహిళ సంఘాలను కలిసి బీజేపీకి ఓటు వేయాలని కోరారు. ఈటల రాజేందర్ తోనే హుజురాబాద్ అభివృద్ధి సాధ్యమన్నారు.