
బీఆర్ఎస్ రజతోత్సవ సభకు ఆ పార్టీ ఎమ్మెల్యే.. హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అక్రమాలకు.. అరాచకాలకు పాల్పడుతున్నారని హుజూరాబాద్ కాంగ్రెస్ ఇన్ చార్జ్ ప్రణవ్ బాబు తెలిపారు. ఎమ్మెల్యే గూండా గిరి చేస్తూ వ్యాపారస్తులను బెదిరించి... డబ్బులు వసూలు చేస్తున్నారని ఆరోపించారు. ఏప్రిల్ 27న జరిగే బీఆర్ఎస్ రజతోత్సవ సభకు గ్రానైట్ వ్యాపారి నుంచి రూ. 50 లక్షలు డిమాండ్ చేశారన్నారు.
గూండా రాజకీయాలను ప్రోత్సహిస్తున్న కేటీఆర్..గతంలో పదేళ్లు దోచుకున్నారు.. ఇప్పుడు కేటీఆర్ బినామీగా కౌశిక్ రెడ్డి డబ్బులు వసూలు చేయమన్నారా అని హుజూరాబాద్ కాంగ్రెస్ నేత ప్రణవ్ బాబు ప్రశ్నించారు. ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై ఓ మహిళ ఫిర్యాదు చేస్తే కేటీఆర్ ఎందుకు స్పందించడంలేదన్నారు. ఉప ఎన్నికలు వస్తే బీఆర్ఎస్ గెలుస్తుందంటున్న కేటీఆర్.. దమ్ముంటే హుజేరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డితో రాజీనామా చేయించి గెలవమనండని సవాల్ చేశారు..