వర్షాలకు బ్రేక్.. మరో వారం వరకు కూల్ వెదర్

వర్షాలకు బ్రేక్.. మరో వారం వరకు కూల్ వెదర్

తెలంగాణలో మరో వారం రోజుల పాటు వర్షాలు ఉండబోవని వాతావారణ శాఖ అంచనా వేసింది. రుతుపవనాలు నెమ్మదించినా ఆగస్టు 15 వరకు  రాష్ట్రంలో భారీ వర్షాలు పడే అవకాశం లేనట్లు తెలుస్తోంది.  అయితే  అక్కడక్కడ తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది. కానీ సాధారం కంటే తక్కువగానే కురుస్తాయి. 

మరో వైపు రాష్ట్రంలో చల్లటి వాతావరణం కనిపించనుంది.  ఇటీవల ఉరుములతో కూడిన వర్షం కారణంగా  రాష్ట్రంలో  ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టాయి.   చాలా చోట్ల సాధారణ ఉష్ణోగ్రతల కంటే తక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.  ఉదయం నుంచి రాష్ట్రంలో వాతావరణం చల్లబడింది. 

మరో వారం రోజుల పాటు ఉదయంపూట  వాతావరణం ఇలాగే ఉండే అవకాశం ఉంది. మధ్యాహ్నం వరకు వాతావరణ పరిస్థితులు మారనున్నాయి. ప్రస్తుతం తెలంగాణ వ్యాప్తంగా చలిగాలులు వీస్తున్నాయి. దీంతో వాతావరణం చల్లగా మారింది. గ్రామీణ ప్రాంతాల్లో చలి ఎక్కువగా ఉంటోంది