హైదరాబాద్ : మణికొండలో అక్రమ నిర్మాణాలు కూల్చివేసిన హైడ్రా

హైదరాబాద్ : మణికొండలో అక్రమ నిర్మాణాలు కూల్చివేసిన హైడ్రా

హైదరాబాద్ నగరంలో అక్రమ నిర్మాణాలు, కబ్జాలపై ఉక్కుపాదం మోపుతున్న హైడ్రా  మరోసారి రంగంలోకి దిగింది. నగరంలోని మణికొండలో ఉన్న  తిరుమల హిల్స్ కాలనీ పార్కులో  అక్రమ నిర్మాణాలను హైడ్రా నేలమట్టం చేసింది. హైడ్రా  అధికారుల ఆదేశాలతో అనుమతి లేని కట్టడాలను కూల్చేశారు మణికొండ మున్సాపాల్టీ అధికారులు. తిరుమల హిల్స్​ కు చెందిన స్థలాన్ని  కబ్జాచేసి  అక్రమంగా నిర్మాణాలు చేపట్టారని నిర్ధారణ కావడంతో కూల్చివేతకు హైడ్రా చీఫ్ రంగనాథ్ నిర్ణయించారు. ఈ మేరకు అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. దీంతో ఇవాళ (మే 22 )   అధికారులు కూల్చివేతకు దిగారు. నిర్మాణదార్ల నుంచి ఎలాంటి అవరోధాలు ఎదురుకాకుండా నార్సింగి పోలీసుల భద్రత మధ్య జేసీబీలతో ఆక్రమణలు తొలగించారు. 

ALSO READ | హైదరాబాద్ ఈ ఏరియాల్లో భారీ వర్షం.. బయటకు వెళ్ళకండి..

 కాలనీ వాసులు అధికారులతో వాగ్వాదానికి దిగారు.  ఈ స్థలం కాలనీ పరిధిలోకి వస్తుందని.. తమకు హెచ్​ఎండీఏ అనుమతి కూడా ఉందని.. ముందస్తు నోటీసులు ఇవ్వకుండా ఎలా కూలుస్తారని అధికారులను స్థానికులు అడ్డుకునే ప్రయత్నం చేశారు.  ఈ స్థలం తిరుమల హిల్స్ పార్క్ కు చెందినదని..  అందుకే అక్రమ నిర్మాణాలను కూల్చివేశామని మణికొండ టౌన్ ప్లానింగ్ అధికారి సంతోష్ సింగ్ తెలిపారు..